Siddhu Jonnalagadda: నా క్యారెక్టర్ షాకింగ్‌గా ఉంటుంది.. సర్‌ప్రైజ్ అవుతారు

ABN , Publish Date - Oct 14 , 2025 | 08:27 PM

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా

Siddhu Jonnalagadda

మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా (Telusu Kada). స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty), రాశి ఖన్నా (Raashii Khanna) హీరోయిన్స్. ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. టీజర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. తెలుసు కదా అక్టోబర్ 17న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

నీరజ గారు ఈ కథ ఎప్పుడు చెప్పారు?

ఏడాదిన్నర క్రితమే చెప్పారు. నాకు చాలా నచ్చింది. చాలా ఎక్సైట్ అయ్యాను. అయితే క్యారెక్టరైజేషన్ మీద ఇంకా వర్క్ చేద్దాము అని చెప్పాను. టిల్లు స్క్వేర్ చేసిన తర్వాత అనుకుంటున్న సినిమా కాబట్టి క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా వుండాలని భావించాం. క్యారెక్టరైజేషన్ చాలా సినిమాలు ముందుకు తీసుకెళ్తుంది. అలా స్టోరీ లాక్ చేసుకున్న తర్వాత అనౌన్స్ చేసాము.

తెలుసు కదాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

ఇందులో నా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉండబోతుంది. కచ్చితంగా ఆడియన్స్ ని షాక్ చేస్తుందని నమ్ముతున్నాను. ఇందులో మంచి హ్యుమర్ కూడా ఉంటుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమా మీద అద్భుతమైన బజ్ వచ్చింది. మేమేదైతే చూసి ఎక్సైట్ అయ్యామో ఆడియన్స్ కూడా ఎక్సయిట్ అవుతారని నమ్ముతున్నాను.

ఇందులో వరుణ్ క్యారెక్టర్ ఒక ఎక్స్పీరియన్స్ ని క్రియేట్ చేస్తుంది. తను మామూలుగా ఉన్నప్పటికీ తన ఆలోచనలు చాలా రాడికల్ గా ఉంటాయి. ఖచ్చితంగా ఆడియన్స్ కి ఆ క్యారెక్టర్ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని నమ్మకం ఉంది.

ట్రైలర్ చూసిన తర్వాత బోల్డ్ కంటెంట్ అనిపించింది. సినిమా ఎలా ఉండబోతుంది?

ఇది ఒరిజినల్ ఫిల్మ్. ఇందులో మీరు 80% కొత్త సీన్స్ ఉంటాయి. ఇంతకుముందు చూసిన సీన్స్ లాగ ఉండవు. లవ్ స్టోరీ లవ్ మ్యారేజ్ ఫ్యామిలీ రిలేషన్ షిప్ గురించి డిస్కషన్ ఉంటుంది. కానీ ప్రతి సీను చాలా కొత్తగా ఉంటుంది. నీరజ గారు చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ తో వచ్చారు. రాశి శ్రీనిధి క్యారెక్టర్స్ స్ట్రాంగ్ ఉంటాయి. వాళ్ళకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరో.ది చాలా న్యూ ఫిలిం. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనికంటూ ఒక జానెర్ ఏర్పడుతుందని అనిపిస్తుంది.

నీరజ ఐడియా చాలా కొత్తగా ఉంది. నాకు నచ్చింది. అయితే క్యారెక్టర్ కుదిరితేనే షూటింగ్ కి వస్తానని తనకు ముందుగానే చెప్పాను. అలాంటి క్యారెక్టర్ కుదిరిన తర్వాతే షూట్ స్టార్ట్ చేశాము. ఈ క్యారెక్టర్ ఒక ఎడ్జ్ మీద ఉంటుంది.

సినిమాలో లవ్, లైఫ్ గురించి డైలాగ్స్ చాలా హార్డ్ హిట్టింగ్ గా వుంటాయి.

ట్రైలర్ లో ఉన్న కంటెంట్ సినిమాలో ఉండదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది?

ట్రైలర్ లో ఉన్న ప్రతి సీన్ సినిమాలో ఉంటుంది. ట్రైలర్ లో చివర్లో వైవా హర్ష సీన్ తప్పితే మిగతా అన్ని సీన్లు సినిమాలో వుంటాయి.

టిల్లు సక్సెస్ అంచనాలు పెరిగాయి కదా.. అంచనాలు అందుకోవడానికి అందుకే క్యారెక్టర్జేషన్ మీద ఎక్కువ వర్క్ చేయాల్సి వచ్చిందా?

నాకే నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంది. ఏ సినిమా చేసిన అందుకే చివరి క్షణం వరకు వదలకుండా కూర్చుంటాను, ఒక క్రేజీ క్యారెక్టర్ చేస్తున్నామని మనకి అనిపించాలి కదా. ఇప్పుడు డిటిఎస్ చూసి వచ్చిన తర్వాత చాలా ఎక్సట్ అవుతున్నా. ఇదే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని భావిస్తాను.

ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉందని డైరెక్ట్ గా చెప్పారు మీరు ఒప్పుకోవడానికి కారణం కూడా అదేనా?

అవునండి. తను చెప్పిన కథ లో ఒక యూనిక్ నెస్ ఉంది. తనకి తొలి రోజు నుంచి అదే విషయం చెప్పాను. కథ చాలా బాగుంది. దానికి తగ్గట్టు క్యారెక్టర్జేషన్ డెవలప్ అయితేనే చేద్దామని చెప్ప్పాను. అలాంటి యూనిక్ క్యారెక్టర్ ఇందులో కుదిరింది.

మీరు ఏ సినిమా చేసిన ఫిలిం మేకింగ్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతుంటారు.. అలా కాకుండా కేవలం యాక్టర్ గానే ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలని ఉందా?

ఒక ప్రాజెక్టు కమిట్ అయినప్పుడు నిర్మాత ఎవరిని బేస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. తెలుసు కదా విషయానికొస్తే విశ్వ గారు మీకు నచ్చింది కాబట్టి సినిమా చేయండి అని చెప్పారు. అలాంటప్పుడు నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది.

నేను ఇన్వాల్వ్ అయ్యాను అంటే నాకు ఎవరు కథలు చెప్పలేదు. నాకోసం ఎవరు కథలు రాయలేదు. సినిమా ఎలా తీయాలో నేర్చుకోవాల్సి వచ్చింది. నా ప్రొడ్యూసర్స్ నన్ను నమ్మి సినిమా చేస్తున్నప్పుడు 100% దానికి నేను న్యాయం చేయాలి.

సినిమా హిట్ అయితే గ్రేట్ డైరెక్షన్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, యాక్టింగ్ అంటారు. అదే సినిమా పోతే నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి నా వల్ల పోయింది. హిట్ అయితే అందరికీ క్రెడిట్ పోతే నా ఒక్కడికే బ్లెమ్. దానికి తెగించే ఇక్కడ ఉన్నాను.

డైలాగ్ చెప్పి కార్వాన్ లోకి వెళ్లిపోవాలని నాకు ఉంటుంది. నేను ఇన్వాల్వ్ అవ్వకుండా సినిమా చేయడం అనేది నా కల. (నవ్వుతూ) అయితే నాకు ఆ లగ్జరీ లేదు.

ఫిలిం మేకింగ్ లో ఎక్కువ వుండటంతో ప్రాసెస్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఆడియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను అనుకున్నది వాళ్లు కూడా ఫీలవుతున్నారా లేదా అనేది కిక్ ఇస్తోంది.

జాక్ సినిమా తర్వాత ఒకరోజు డైరెక్టర్ కొరటాల శివ గారు ఫోన్ చేసి ' టిల్లుతో ఆల్ టైం హై చూశావు, జాక్ తో లో చూశావు.. ఇక నువ్వు ఏం చేసినా ఆ రెండిటి మధ్య చూస్తావు' అన్నారు. ఈ మాట ఇకపై ఎలాంటి సిచువేషన్స్ అయినా ఇలా చూడాలని ఒక థాట్ ని కలిగించింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

విశ్వగారు, కృతిగారి తో నాకు మంచి అనుబంధం ఉంది. నాకు చాలా ఫ్రీడం ఇస్తారు. దేనికి వెనకడుగు వేయరు. వారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అంతకుముందు మిస్టర్ బచ్చన్ లో కూడా చేశాను. మంచి కథ దొరికితే రవితేజ గారితో కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నాను.

నీరజ గారు డెబ్యూట్ డైరెక్టర్ కదా.. వారితో వర్క్ ఎక్స్పీరియన్స్?

కొత్తవారితో కలిసి వర్క్ చేయడం ఒక రిస్క్ తో కూడుకున్న పనే. అయితే రిస్క్ తో పాటు ఒక రివార్డు కూడా వుంటుంది. నీరజ గారితో వర్క్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి టీం తో వెళ్ళాలనేది ముందుగానే నిర్ణయించుకున్నాం. పీపుల్ మీడియా ప్రొడక్షన్ హౌస్, మ్యూజిక్ తమన్, ఎడిటర్ నవీన్ ఇలా చాలా ఎక్స్పీరియన్స్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పనిచేశారు. మీరు ట్రైలర్ టీజర్ చూస్తే ఎక్కడ కూడా కొత్త సినిమా కొత్త డైరెక్టర్ చేసిన సినిమాలా వుండదు. ఒక పెద్ద సినిమా మేకింగ్ లానే ఉంటుంది.

హీరోయిన్స్ గురించి?

శ్రీనిధి, రాశి క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఒక సీన్లో రాశి ఆడియన్స్ ని పిచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. క్యారెక్టర్స్ చాలా బాగుంటాయి. ఇద్దరికీ చాలా స్ట్రాంగ్ క్యారెట్స్ ఉన్నాయి. వాళ్లకి మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరో కి ఉంది. నా క్యారెక్టర్ సినిమాలో 23 నిమిషం తర్వాత ఒక వైల్డ్ టర్న్ తీసుకుంటుంది.

టెక్నికల్ టీం గురించి ?

జ్ఞాన శేఖర్ గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. విజువల్స్ తో పిచ్చెక్కించారు. థియేటర్స్ లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది.

తమన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు సాంగ్స్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. తమన్ గారి మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ అసెట్.

ఎడిటర్ నవీన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తనకి చాలా క్రెడిట్ ఇవ్వాలి. అవినాష్ గారు గ్రేట్ సెట్ వర్క్ చేశారు. ప్రతి లోకేషన్ ని ఎప్పటి వరకు చూడనట్టుగా డిజైన్ చేశారు. నీరజ ఫస్ట్ టైమర్ అయినప్పటికీ వీళ్ళ అందరితో కలిసి అద్భుతమైన వర్క్ ని ఇచ్చారు.

మీరు డైరెక్షన్ చేసే అవకాశం ఉందా?

డెఫినెట్లీ. ఐడియాస్ ఉన్నాయి. అయితే దానికి సమయం కుదరాలి.

తెలుసు కదాకి సీక్వెల్ చేసే అవకాశం ఉందా?

ఈ కథకైతే ముగింపు ఉంది. టిల్లుకి కూడా మేము సీక్వెల్ చేస్తామని ఎప్పుడు అనుకోలేదు. జనం కోరుకున్నారు కాబట్టి అది జరిగింది. వరుణ్ క్యారెక్టర్ కి ఆ డిమాండ్ వస్తే చేసే అవకాశం ఉంటుంది.

Updated Date - Oct 14 , 2025 | 08:56 PM