Trisha: శారీరకంగా, మానసికంగా శ్రమ పడింది దానికే
ABN, Publish Date - May 04 , 2025 | 08:54 AM
కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా... త్రిషకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అగ్రహీరోల ఛాయిస్ లిస్టులో ఆమెకు చోటుంది.
కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా... త్రిషకు (Trisha) డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ అగ్రహీరోల ఛాయిస్ లిస్టులో ఆమెకు చోటుంది. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ (Vishwambhara), కమల్‌హాసన్ ‘థగ్ లైఫ్’, ‘సూర్య 45’ (Suriya 45)వంటి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. నేడు (4న) ఈ చెన్నై సోయగం పుట్టినరోజు సందర్భంగా తన వ్యక్తిగత విషయాల్ని ఇలా పంచుకుంది.
పెళ్లెప్పుడంటే...
పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అనడిగితే నా దగ్గర సమాధానం లేదు. ఎప్పుడు చేసుకుంటావ్? అంటే నాకే తెలియదు. నిజం చెప్పాలంటే నాకు వివాహంపై నమ్మకం లేదు. పెళ్లి జరిగినా ఓకే.. జరక్కపోయినా ఓకే. నాకైతే బాధేమీ ఉండదు. కానీ ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటా. ఇది మాత్రం పక్కా.
ఫోన్ పిచ్చి కాస్త ఎక్కువే...
నేను షూటింగ్ లొకేషన్‌లో కాస్త రిజర్వ్‌డ్‌గా ఉంటా. కానీ నిజ జీవితంలో మాత్రం పూర్తి భిన్నం. నాకు బోలెడంత మంది స్నేహితులున్నారు. మేమంతా ఒకచోట చేరామంటే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుంది. ఖాళీ దొరికితే చాలు... ఫోన్‌లో ఛాటింగ్ చేస్తా. అంత పిచ్చిగా ఫోన్ వాడుతుంటా. వెంకటేశ్, ప్రకాశ్ రాజ్‌లకు నా ఫోన్ పిచ్చి గురించి తెలిసి, నన్ను ఏడిపిస్తుంటారు.
అస్సలు ఊహించలేదు...
నాకు ఇష్టమైన హీరోల్లో మహేష్‌బాబు ఒకరు. చాలామందికి తెలియని విషయమేంటంటే... సినిమాల్లోకి రాకముందే మేమిద్దరం ఒకరికొకరం తెలుసు. ఆయన కాలేజ్ చదువుతున్న రోజుల్లో... చెన్నైలో కామన్ ఫ్రెండ్స్ ద్వారా మా ఇద్దరికీ పరిచయం ఉంది. మేమిద్దరం స్టార్స్ అవుతామని అప్పట్లో అస్సలు ఊహించలేదు. మహేష్ చాలా కష్టపడతారు. అందుకే ఆయన సూపర్‌స్టార్ అయ్యారు.
అదొక మెంటల్ థెరపీ...
నేను పెద్ద ఫుడీని. స్కూల్‌లో ఉన్నప్పుడైతే గోడ దూకి మరీ రెస్టారెంట్లకు వెళ్లేదాన్ని. మనసు బాగోకపోయినా, కాస్త లోగా అనిపించినా చాక్లెట్స్ చప్పరిస్తా. అందుకే నా బ్యాగ్‌లో ఎప్పుడూ చాక్లెట్స్ ఉంటాయి. వంట కూడా బాగా చేస్తా. నేను చేసే నూడుల్స్, దాల్ సబ్జీని ఎవ్వరైనా సరే లొట్టలేసుకుంటూ తినాల్సిందే. వంట చేయడమనేది నాకొక మెంటల్ థెరపీగా పనిచేస్తుంది.
ఫ్యాషన్ ట్రెండ్స్ విషయానికొస్తే.. నేను ఎవరినీ అనుసరించను. నాకంటూ ఒక యునీక్ స్టైల్ ఉంది. దాన్ని మాత్రమే ఫాలో అవుతుంటా. సౌకర్యవంతంగా ఉన్న దుస్తులను ధరించడానికే ఇష్టపడతా. స్కిన్నీ జీన్స్, రెడ్ లిప్‌స్టిక్స్... నాకు సెట్ కావు. అందుకే వాటి జోలికి అస్సలు వెళ్లను. ఎక్కువగా చీరలు, జీన్స్, టీ షర్టులు ధరించడానికి ఇష్టపడతా.
ఫటాఫట్...
- తొలి సంపాదన: రూ. 12,500 (యాడ్స్ ద్వారా)
- ఫేవరెట్ హాలీడే డెస్టినేషన్: న్యూయార్క్
- ట్రావెలింగ్‌లో వెంట ఉండేవి: బుక్, లిప్‌బామ్, ల్యాప్‌టాప్, శానిటైజర్, వెట్‌వైప్స్
- ఫేవరెట్ అడ్వెంచర్: స్కై డైవింగ్
- బలం: అనుకున్న పని వెంటనే చేయడం
- బలహీనత: ఓర్పు తక్కువ
- ఇష్టమైన కవి: రాబర్ట్ ఫ్రాస్ట్
- ఫేవరెట్ హీరోయిన్స్: అనుష్క, నయనతార, సమంత