Kubera: కుబేర తర్వాత.. శేఖర్ కమ్ములతోనే మరో సినిమా
ABN , Publish Date - Jun 12 , 2025 | 04:49 PM
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న కాంబినేషన్‌లో టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కుబేర.
నాగార్జున (Nagarjuna), ధనుష్ (Dhanush), రష్మిక మందన్న (Rashmika) కాంబినేషన్‌లో టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ (Kuberaa). సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలు. జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచిన మేకర్స్ ఇప్పటికే విడుదల చేసిన పాటలు, గ్లిమ్స్ టీజర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్ (Suniel Narang), పుస్కుర్ రామ్ మోహన్ రావు (Puskur Ram Mohan Rao) విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
'కుబేర' ప్రాజెక్టు ఎలా మెటీరియలైజ్ అయింది?
శేఖర్ కమ్ముల గారు 'లవ్ స్టోరీ' తర్వాత ఈ ఐడియాని మాకు చెప్పడం జరిగింది. ఈ కథకు ధనుష్ అయితే బాగుంటుందని ఆయన భావించారు. ఆయనకి ఈ కథని చెప్పారు. ధనుష్ 20 నిమిషాలు కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఆపై వెంటనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాం. ధనుష్ పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు. నాగార్జున ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక గురించి అందరికీ తెలుసు. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో ఈ సినిమాని చేయడం జరిగింది. కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ కాఫీ ఆల్రెడీ రెడీ అయింది. సినిమా అద్భుతంగా వచ్చింది.
శేఖర్ కమ్ముల ఫస్ట్ టైం ఇంత బిగ్ స్టార్ కాస్ట్ తో సినిమా చేస్తున్నారు కదా? ఇది ఎంత డిఫరెంట్ గా ఉండబోతుంది ?
శేఖర్ కమ్ముల మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్ తో తీశారు. కచ్చితంగా ఆడియన్స్ కి చాలా న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. శేఖర్ కమ్ముల స్టార్స్ ని క్యారెక్టర్స్ గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్. ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి.
కుబేర కాన్ఫ్లిక్ట్ ఏమిటి?
మోస్ట్ రిచెస్ట్ మాన్ ఇన్ ద వరల్డ్, ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ ది స్ట్రీట్స్ ఇది కాన్ఫ్లిక్ట్.
కుబేర కథలో మిమ్మల్ని ఎక్సైజ్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?
శేఖర్ మంచి ఎమోషన్స్ తో ఆడియన్స్ ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి.
షూటింగ్ లో ఎలాంటి ఛాలెంజస్ ఎదుర్కొన్నారు?
రియల్ లొకేషన్స్ లో షూట్ చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. రియల్ స్లమ్స్, గార్బేజ్, డంపింగ్ యార్డ్స్ లో తీసాం. బొంబాయిలో సినిమాని సూట్ చేయడం మరో ఛాలెంజ్. బడ్జెట్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కంటెంట్ కు కావలసిన బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాం. సినిమాని చాలా గ్రాండ్ గా దాదాపు 1600 స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నాం. అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం ఉంది.
నాగార్జున గారిని ఎలా ప్రాజెక్టులో తీసుకొచ్చారు?
నాగార్జున గారితో వర్క్ చేయాలని మాకు ఎప్పటినుంచో ఉండేది. శేఖర్ గారికి ఈ పాత్ర కోసం నాగార్జున గారు తప్పితే మరొకరు కనిపించలేదు. నాగ్ సర్ కి ఈ కథ నచ్చింది. ఆయన చాలా అద్భుతంగా నటించారు. ఆయన్ని తప్పితే మరొకరిని ఆ పాత్రలో ఊహించలేనంత గొప్పగా పెర్ఫార్మ్ చేశారు.
దేవిశ్రీప్రసాద్ గారి మ్యూజిక్ గురించి ?
దేవిశ్రీ అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా కోసం చాలా డిఫరెంట్ సాంగ్స్ ఇచ్చారు. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ధనుష్ రెండు పాటలు పాడారు. ఇది డైరెక్టర్, దేవిశ్రీ కలెక్టివ్ డెసిషన్.
తమిళ్‌లో కూడా మీరే రిలీజ్ చేస్తున్నారా?
లేదండి. రాహుల్ అనే డిస్ట్రిబ్యూటర్ కి ఇచ్చాము
సునీల్ గారు.. మీ అమ్మాయి జాన్విని నిర్మాతగా చేయాలనే భావిస్తున్నారా?
కచ్చితంగా అండి. తనకి సినిమా నిర్మాణం పట్ల చాలా ఆసక్తి ఉంది. చాలా యాక్టివ్ గా ఉంటుంది. అలాగే మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి కూడా ప్రొడక్షన్ పై ఆసక్తి ఉంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
శేఖర్ కమ్ముల గారితో మరో సినిమా చేయనున్నాం. అయితే ఇంకా హీరో ఎవరనేది ఫైనల్ కాలేదు.