Naveen Chandra: నాకు ఎనిమిది భాషలు వచ్చు. నా సినిమాలకి నేనే డబ్బింగ్ చెబుతా
ABN, Publish Date - May 15 , 2025 | 07:32 PM
ఇటీవల వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మంచి దూకుడు మీదున్నాడు హీరో నవీన్ చంద్ర. ఆయన హీరోగా నటించిన నూతన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ఎలెవెన్.
ఇటీవల వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో మంచి దూకుడు మీదున్నాడు హీరో నవీన్ చంద్ర (Naveen Chandra). ఆయన హీరోగా నటించిన నూతన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చిత్రం ఎలెవెన్ (Eleven). ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి వద్ద కలకలప్పు 2, వంద రాజవతాన్ వరువేన్, యాక్షన్ వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించారు. AR ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి నిర్మించారు. గతంలో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కించుకున్న సిలా నేరంగలిల్ సిలా మణిధర్గల్, సెంబి చిత్రాల విజయం తర్వాత ప్రయత్నంగా ఈ సినిమాను రూపొందించడం విశేషం.ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్లు సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
సినిమాకు.. లెవన్ అనే టైటిల్ పెట్టడానికి కారణం?
అది కథ నుంచి వచ్చిన టైటిల్. సినిమా చూసినప్పుడు మీకే తెలుస్తుంది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. తమిళంలో షోస్ జరిగాయి. యునానిమాస్ సూపర్ రెస్పాన్స్. చూసిన ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. మేము అనుకున్న ట్విస్ట్ లు, టర్న్స్, అడ్రినల్ రష్ మూమెంట్స్ ప్రేక్షకులను ఎక్సయిట్ చేశాయి. ఆడియన్స్ రెస్పాన్స్ పై చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా సంవత్సరాల తర్వాత మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ దొరికింది.
ఈ థ్రిల్లర్ ఎంత కొత్తగా వుండబోతోంది?
ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్ లో రాని ఒక డిఫరెంట్ ఎమోషనల్ కాన్సెప్ట్ ఈ సినిమా. ఆడియన్స్ కి చాలా కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఇందులో ప్రతిదానికి లాజిక్ ఉంటుంది. ఇందులో ట్విస్ట్ లని ముందుగా డీకోడ్ చేయడం కష్టం.
స్క్రీన్ ప్లే ఎలా ఉండబోతోంది? డైరెక్టర్ లోకేష్ గురించి ?
మంచి రైటింగ్ బలం ఉన్న సినిమా. తెలుగు తమిళ్ రెండు భాషల్లో సినిమా చేయడానికి దాదాపు ఆరు నెలలు సినిమా ప్రీప్రొడక్షన్ చేశాం. లెవన్ చూస్తున్నపుడు విజువల్ గా ఓ కమర్షియల్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. నిర్మాతలు చాలా ఖర్చు చేశారు. ఇది డైరెక్టర్, టెక్నికల్ ఫిల్మ్. లోకేష్ సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన వారంతా డైరెక్టర్ గురించి, రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంగేజ్ చేస్తుంది. సెకండ్ హాఫ్ మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది.
రెండు భాషల్లో సినిమాని షూట్ చేశారా?
అవును. రెండు భాషల్లో డిఫరెంట్ డిఫరెంట్ షాట్స్ తీశాం. స్క్రిప్ట్ ని కూడా ట్రాన్స్ లేట్ చేయలేదు. తెలుగు నుంచి ప్రత్యేకంగా రైటర్ తో రాయించి తెలుగు స్క్రిప్ట్ తో షూట్ చేశాం. నిర్మాతలు ఎక్కడ రాజీ పడకుండా ఖర్చు చేశారు. బైలింగ్వల్ చేయడం ఇప్పుడు అడ్వాంటేజ్ గానే భావిస్తున్నాను. ఈ సినిమాకి తమిళ్ డబ్బింగ్ నేనే చెప్పాను. నాకు ఎనిమిది భాషలు వచ్చు. నా అన్ని సినిమాలకి ప్రతి భాషలో నేనే డబ్బింగ్ చెప్పడానికి ప్రాధాన్యత ఇస్తుంటాను.
ఒక క్యారెక్టర్ నుంచి బయటికి రావడానికి ఎలాంటి ప్రాక్టీస్ చేస్తుంటారు?
మొదట్లో ఒక క్యారెక్టర్ నుంచి బయటపడటం నాకూ కొంచెం సమస్యగానే ఉండేది. షూటింగ్ తర్వాత కూడా ఆ క్యారెక్టర్ ని ఇంటి వరకూ తీసుకెళ్ళే వాడిని. అయితే పెళ్లి తర్వాత దాన్ని మెల్లమెల్లగా మానుకున్నాను. షూటింగ్ లో ఉన్నంత వరకే డైరెక్టర్ డిజైన్ చేసే క్యారెక్టర్ లో ఉంటాను. తర్వాత స్విచ్ అఫ్ చేసేస్తాను.
మాస్ జాతర లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది?
రవితేజ గారికి విలన్ గా చేయాలని సితార నుంచి కాల్ వచ్చింది. రిఫర్ చేసింది కూడా రవితేజ గారే. అరవింద్ సమేతలో నా క్యారెక్టర్ ని ఎలా యూనిక్ గా ఫీల్ అయ్యారో.. అంతే యూనిక్ గా ఈ సినిమాలో ఉంటుంది. నా లుక్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. నా ప్రతి సినిమాకి పది మంది ఆడియన్స్ అయినా పెరగాలనే ఉద్దేశంతో అన్ని రకాల పాత్రలు చేస్తున్నాను.
కరుణ్ కుమార్ తో చేస్తున్న సినిమా గురించి?
హానీ అనే సినిమా జరుగుతోంది. చాలా డార్క్ సినిమా అది. చాలా కొత్తగా ఉంటుంది. అలాగే కాళీ అనే యాక్షన్ సినిమా చేస్తున్నా. అలాగే తమిళ్ లో ఓ సినిమా జరుగుతోంది. అలాగే హరి అనే దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. అది కామెడీ ఫిలిం. ఫస్ట్ టైం కామెడీ చేయడం చాలా మంచి ఎక్స్ పీరియన్స్.
ఆల్ ది బెస్ట్, థాంక్ యూ