Toxic: టాక్సిక్‌ కొత్త షెడ్యూల్‌ ఎప్పుడు.. ఎక్కడంటే..

ABN , Publish Date - Sep 20 , 2025 | 09:57 AM

'కేజీఎఫ్‌’ సినిమా సక్సెస్‌తో ఓవర్‌నైట్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు కన్నడ నటుడు యశ్‌. ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’.

'కేజీఎఫ్‌’ (KGF) సినిమా సక్సెస్‌తో ఓవర్‌నైట్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయారు కన్నడ నటుడు యశ్‌ (yash). ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘టాక్సిక్‌’ (toxic) . గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  పీరియాడిక్‌ గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌, మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కియారా (kiara adwani) కథానాయిక. నయనతార, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రధారులు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. సినిమా. తాజాగా ముంబైలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేశారు.





దాదాపు 45 రోజులపాటు సాగిన ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ తెరకెక్కించినట్లు బాలీవుడ్‌ మీడియా తెలిపింది. అక్టోబరు తొలి వారం నుంచి బెంగళూరులో మరో కొత్త షెడ్యూల్‌ ప్రారంభిస్తారని తెలుస్తోంది. నవంబర్ చివరి వారానికి చిత్రీకరణ మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం ముందుకు సాగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Sep 20 , 2025 | 10:00 AM