Thalaivar173: అయ్యయ్యో.. రజినీని డైరెక్ట్ చేసే దర్శకుడే లేడా..

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:38 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ కోలీవుడ్ లోనే లేరా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది.

Thalaivar173

Thalaivar173: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ను డైరెక్ట్ చేసే డైరెక్టర్ కోలీవుడ్ లోనే లేరా.. ? అంటే నిజమే అన్న మాట వినిపిస్తుంది. హిట్ డైరెక్టర్స్ ఖాళీగా లేరు.. కుర్ర డైరెక్టర్స్ కుర్ర హీరోలతో బిజీగా ఉన్నారు. సీనియర్ హీరోలు తమకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో అడ్జెస్ట్ అవుతున్నారు. అయినా దాదాపు డజనుకు పైగా ఉన్న డైరెక్టర్స్ లో ఒక్కరు కూడా రజినీని డైరెక్ట్ చేయలేరా అంటే ఆ కాంబోలు ప్రేక్షకులను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని టాక్. మరి ఆ కాంబోస్ ఏంటి అనేది చూద్దాం.

రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మాతగా తలైవర్ 173 మొదలైన విషయం తెల్సిందే. సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు. హరర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన సుందర్ సి, రజినీతో సినిమా అంటే అంచనాలను పెంచేసుకోవచ్చు అనుకున్నారు. కానీ, వారం కూడా అవ్వకముందే ఈ సినిమానుంచి సుందర్ తప్పుకున్నట్లు ప్రకటించాడు. అందుకు..కారణం రజినీకి సునాదర్ ఒక హారర్ లైన్ చెప్పాడట. అది నచ్చడంతోనే వెంటనే సినిమాను పట్టాలెక్కించాడు. అయితే పూర్తి కథ చెప్పేసరికి అది రజినీకి నచ్చలేదని అందుకే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అని సమాచారం.

అయితే సుందర్ సి వెళ్ళిపోయినా కూడా కమల్ - రజినీ కాంబో మాత్రం ఆగిపోలేదని తెలుస్తోంది. కానీ, సుందర్ ప్లేస్ ను రీప్లేస్ చేసే డైరెక్టర్ ఎవరు.. ? అంటే మాత్రం ఒక్క పేరు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడం లేదు. సీనియర్ డైరెక్టర్స్ శంకర్, మణిరత్నం ఫార్మ్ లో లేరు. చివరగా వారు తీసిన సినిమాలు ఏ రేంజ్ లో డిజాస్టర్స్ అయ్యాయో అందరికీ తెల్సిందే. ఇక అట్లీ, వెంకట్ ప్రభు లాంటి డైరెక్టర్స్ హిట్ హీరోలతో సినిమాలు చేస్తూ బిజీగా మారారు.

కార్తీక్ సుబ్బరాజ్ పేరు అనుకుంటున్నా కూడా ఆయన గత చిత్రం చూసి వద్దు బాబు అంటున్నారు. ఇక పా రంజిత్ ని అయితే రజినీనే వద్దు అంటున్నాడు. ఇప్పటికే రెండు డిజాస్టర్స్ ఇచ్చాడు ఇప్పుడు మూడోది కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేరని టాక్. ఏఆర్ మురగదాస్.. దర్బార్ జ్ఞాపకాలను ఇంకా మర్చిపోలేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మిగిలింది నెల్సన్, లోకేష్.. ఇప్పటికే నెల్సన్ తో రజినీ జైలర్ 2 చేస్తున్నాడు. లోకేష్ ఆల్రెడీ కూలీతో గట్టి దెబ్బ తిన్నాడు. దీనివల్లనే రజినీ - కమల్ తో విభేదాలు కూడా వచ్చి మాట్లాడుకోవడం కూడా మానేశారట. ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నా రజినీని డైరెక్ట్ చేసే సమర్థవంతమైన డైరెక్టరే లేడు అని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. మరి కమల్.. రజినీ కోసం ఏ డైరెక్టర్ ను పట్టుకొస్తాడో చూడాలి.

Updated Date - Nov 14 , 2025 | 04:48 PM