Parvathy Thiruvothu: ప్రేక్షకులను.. మోసం చేయలేం

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:12 AM

నేటి కాలంలో ప్రేక్షకులను మోసం చేయలేమని హీరోయిన్‌ పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) అన్నారు.

Parvathy Thiruvothu

నేటి కాలంలో ప్రేక్షకులను మోసం చేయలేమని హీరోయిన్‌ పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) అన్నారు. తమిళంలో ‘పూ’, ‘మరియాన్‌’, ‘ఉత్తమవిలన్‌’, ‘తంగలాన్‌’ వంటి చిత్రాల్లో నటించి కోలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైన ఈ మలయాళ భామ ఇపుడు దక్షిణాది భాషల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది.

parvathy.jpeg

ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘ఇపుడు ప్రేక్షకులు భాష గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. వారు వాస్తవిక కథలను మాత్రమే ఇష్టపడుతున్నారు. ఈ మార్పు చాలా మంచిది. ఎందుకంటే ఇది మనల్ని మరింతగా కష్టపడి పనిచేయడానికి, సినిమా పట్ల నిజాయితీగా ఉండటానికి ప్రేరేపిస్తుంది.

parvathy.jpg

గతంలో హిందీ సినిమా దక్షిణ భారత సినిమా వంటిది కాదని భావించాను. ఎపుడూ రోటీన్‌ కథలతో సినిమాలు తీసేవారు. ఇపుడు వారు కూడా మారారు. నేడు హిందీ సినిమాల్లో కథలు చెప్పే విధానం కూడా పూర్తిగా మారిపోయింది. వాస్తవిక కథలతో సినిమాలు వస్తున్నాయి. ఓటీటీలు వచ్చిన తర్వాత దక్షిణాది సినిమా ప్రపంచం మరింతగా విస్తరించిందని పేర్కొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:12 AM