Vishal: ధన్సికను పెళ్లాడబోతున్న విశాల్‌

ABN, Publish Date - May 20 , 2025 | 12:36 AM

విశాల్‌ (Vishal) త్వరలో ఓ ఇంటివాడుకానున్నాడు. ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడని సోమవారం కోలీవుడ్‌ మీడియా కోడై కూసింది. తాజాగా దీనిపై ఇద్దరూ స్పందించారు.

విశాల్‌ (Vishal) త్వరలో ఓ ఇంటివాడుకానున్నాడు. ఆయన పెళ్లి చేసుకోబోతున్నాడని సోమవారం కోలీవుడ్‌ మీడియా కోడై కూసింది. తాజాగా దీనిపై ఇద్దరూ స్పందించారు. చెన్నైలో నిర్వహించిన ఓ సినిమా ఈవెంట్‌లో విశాల్‌, సాయి ధన్సిక (Sai Dhansika) పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పెళ్లి తేదీని సైతం వెల్లడించారు. ఆగస్టు 29న పెళ్లి జరగబోతున్నట్లు తెలిపారు. ‘‘ధన్సిక చాలా మంచి వ్యక్తి. మేం కలిసి మంచి జీవితాన్ని ప్రారంభించబోతున్నాం. పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుంది’’ అని విశాల్‌ అన్నారు. ‘‘కొంతకాలం క్రితం మా మధ్య పరిచయం మొదలైంది. అది ప్రేమగా మారింది. విశాల్‌ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అని ధన్సిక పేర్కొన్నారు. రజనీకాంత్‌ ‘కబాలి’లో కీలక పాత్ర పోషించారు ధన్సిక. తదుపరి. ‘షికారు’, ‘అంతిమ తీర్పు’, ‘దక్షిణ’ తదితర చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు.

విశాల్‌ పెళ్లిపై కొన్నేళ్లగా ఊమర్లు వస్తూనే ఉన్నాయి. నడిఘర్‌ సంఘం భవన నిర్మాణం పూర్తయాకే పెళ్లి చేసుకుంటానని విశాల్‌ ప్రకటించారు. ఇటీవల ఆ బిల్డింగ్‌ పూర్తయిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘త్వరలోనే పెళ్లి చేసుకుంటా. నా జీవిత భాగస్వామిని కనుగొన్నాను. ఇప్పటికే పెళ్లి గురించి మా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇది తప్పకుండా ప్రేమ వివాహమే. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తాను’’ అని అన్నారు.

.

Updated Date - May 20 , 2025 | 12:36 AM