Love marriage: విక్రమ్ ప్రభు ‘లవ్ మ్యారేజ్’ రిలీజ్ ఎప్పుడంటే
ABN , Publish Date - Jun 10 , 2025 | 02:27 PM
సీనియర్ నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా నటించిన ‘లవ్ మ్యారేజ్’ (love marriage) మూవీ విడుదల తేదీ ఖరారైంది
సీనియర్ నటుడు ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు (Vikram Prabhu) హీరోగా నటించిన ‘లవ్ మ్యారేజ్’ (love marriage) మూవీ ఈ నెల 27న విడుదలకానుంది. ఈ మేరకు మేకర్స్ ఓ పోస్టరు ద్వారా అధికారికంగా వెల్లడించారు. ‘ఇరుగపట్రు’ వంటి హిట్ మూవీ తర్వాత విక్రమ్ ప్రభు ‘రైడ్’ చిత్రంలో నటించగా అది నిరాశకు గురిచేసింది. కొన్ని నెలల విరామం తర్వాత కొత్త చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. డెబ్యూ డైరెక్టర్ షణ్ముగ ప్రియన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో సుష్మిత భట్, మీనాక్షి దినేష్, రమేష్ తిలక్, అరుల్దాస్, గజరాజ్ తదితరులు నటించారు.
సీనియర్ నటుడు సత్యరాజ్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు. రైజ్ఈస్ట్ బ్యానరుపై తెరకెక్కిన ఈ చిత్రానికి డాక్టర్ శ్వేత శ్రీ, శ్రీనిధి సాగర్ నిర్మాతలు. వివాహం ఆలస్యం కావడంతో హీరో సమాజంలో ఎదుర్కొనే సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని ఈ మూవీని రూపొందించారు. తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా శక్తి ఫిలిమ్ ఫ్యాక్టరీపై నిర్మాత శక్తివేలన్ రిలీజ్ చేయనున్నారు.