Vijay Antony: మర్డర్ మిస్టరీ - క్రైమ్ థ్రిల్లర్ గా మార్గన్
ABN, Publish Date - May 14 , 2025 | 06:01 PM
ప్రముఖ కథానాయకుడు విజయ్ ఆంటోని తాజా చిత్రం 'మార్గన్'. జూన్ 27న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇందులో విజయ్ మేనల్లుడే విలన్ గా నటిస్తుండటం విశేషం.
సంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి హీరోగా మారి అప్రతిహతంగా దూసుకుపోతున్నాడు విజయ్ ఆంటోనీ (Vijay Antony). అతని తాజా చిత్రం 'మార్గన్' (Maargan). ఈ మర్టర్ మిస్టరీ - క్రైమ్ థ్రిల్లర్ ను లియో జాన్ పాల్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీని విజయ్ ఆంటోని ఫిలిమ్ కార్పొరేషన్ నిర్మిస్తుండగా, మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. విశేషం ఏమంటే ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ ధీషన్ విలన్ గా పరిచయం అవుతున్నాడు. వీరిద్దరి మధ్య పలు యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను సముతిరకని (Samuthirakani), మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, దీప్సిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి తదితరులు పోషిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: OG షూటింగ్ లో పవర్ స్టార్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి