Veera Dheera Sooran: విక్రమ్‌ యాక్షన్‌-ప్యాక్డ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN, Publish Date - Jan 22 , 2025 | 08:59 PM

చియాన్‌ విక్రమ్‌ (Chiyaan VIkram) యాక్షన్‌-ప్యాక్డ్‌  సినిమా 'వీర ధీర సూరన్‌’ పార్ట్‌ 2 (Veera Dheera Sooran) విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది.

Veera Dheera Sooran: విక్రమ్‌ యాక్షన్‌-ప్యాక్డ్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

చియాన్‌ విక్రమ్‌ (Chiyaan VIkram) యాక్షన్‌-ప్యాక్డ్‌  సినిమా 'వీర ధీర సూరన్‌’ పార్ట్‌ 2 (Veera Dheera Sooran) విడుదల తేదీని నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఎస్‌.యు. అరుణ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చియాన్‌ విక్రమ్‌, ఎస్‌.జె. సూర్య, సూరజ్‌ వెంజరాముడు, దుషార విజయన్‌ నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా గ్లింప్స్‌, టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింతపెరుగుతున్నాయి,  ఇవన్నీ మిలియన్ల వ్యూస్‌ మైలురాయిని చేరుకున్నాయి.  మార్చి 27న ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్‌ అఫీషియల్‌ గా ప్రకటించారు. తెలుగులో ఎన్వీఆర్‌ సినిమాస్‌ ద్వారా విడుదల చేయనున్నారు.

Updated Date - Jan 22 , 2025 | 08:59 PM