Karthi: హ‌మ్మ‌య్యా.. అన్న‌గారు వ‌చ్చేస్తున్నారు 

ABN , Publish Date - Dec 16 , 2025 | 02:55 PM

నలన్ దురైస్వామి దర్శకత్వంలో కార్తీ హీరోగా నటించిన  యాక్షన్ కామెడీ చిత్రం 'వా వాత్తియార్' (అన్న‌గారు వ‌స్తున్నారు) ఈ నెల 24వ తేది విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం.

నలన్ దురైస్వామి దర్శకత్వంలో కార్తీ (Karthi) హీరోగా నటించిన  యాక్షన్ కామెడీ చిత్రం 'వా వాత్తియార్' (Vaa Vaathiyaar) (అన్న‌గారు వ‌స్తున్నారు). ఈ నెల 24వ తేది విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఆర్ధిక సమస్యల కారణంగా వాయిదా పడింది. సినిమాకి సంబంధించిన అన్ని సమస్యలు ఈ నెల 24వ తేదీలోగా పరిష్కరించేలా చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ వర్ధంతి రోజైన ఈ నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేస్తే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

KArthi.jpg

స్టూడియో గ్రీన్ నిర్మించిన ఈ చిత్రంలో కార్తీ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించింది. రాజ్ కిరణ్, సత్యరాజ్, కరుణాకరన్  తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని 'అన్నగారు వస్తారు' పేరుతో విడుదల చేస్తున్నారు.   

Updated Date - Dec 16 , 2025 | 06:55 PM