45 ట్రైలరేంటి.. ఇంత చిత్ర, విచిత్రంగా ఉంది
ABN , Publish Date - Dec 16 , 2025 | 09:48 AM
కన్నడ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న మల్టీస్టారర్ మూవీ ‘45’. కన్నడ సూపర్ స్టార్స్ శిరాజ్ కుమార్, ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి వంటి అగ్ర తారలు లీడ్ రోల్స్‌లో నటించారు.
కన్నడ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్న మల్టీస్టారర్ మూవీ ‘45’. కన్నడ సూపర్ స్టార్స్ శిరాజ్ కుమార్ (Shiva Rajkumar), ఉపేంద్ర (Upendra), రాజ్ బీ శెట్టి (Raj B. Shetty)వంటి అగ్ర తారలు లీడ్ రోల్స్‌లో నటించారు.పాన్ ఇండియాగా మూడు నెలల క్రితమే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ ఎట్టకేలకు థియేటర్లకు వచ్చేందుకు ముస్తాబయింది.
ప్రముఖ కన్నడ సంగీత దర్శకుడు అర్జున్ జన్యా ( Arjun Janya) ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండడం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర అన్ని భాషల ట్రైలర్స్ సోమవారం విడుదల చేయగా సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది.
ట్రైలర్‌లో పవర్‌ఫుల్ విజువల్స్, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్, హై క్వాలిటీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఉపేంద్ర, శివ రాజ్‌కుమార్ మధ్య వచ్చే సీన్లు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. కథను పూర్తిగా రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటెన్ చేస్తూ ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు. ఉపేంద్ర పాత్రనుగమనిస్తే.. ఆయన గత సంవత్సరం నటించిన యూఐ సినిమాను గుర్తు చేసేలా ఉంది.