Marco: మోస్ట్ వయలెంట్ మూవీ.. మార్కో2 స్టార్ట్! కానీ
ABN , Publish Date - Sep 18 , 2025 | 08:10 AM
గతేడాది సైలెంట్‌గా థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించిన మలయాళ మోస్ట్ వైలెంట్ చిత్రం మార్కో.
గతేడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరి1న ఇతర భాషల్లోనూ సైలెంట్‌గా థియేటర్లకు వచ్చి సంచలన విజయం సాధించిన మలయాళ మోస్ట్ వైలెంట్ చిత్రం మార్కో (Marco). ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా నటించిన ఈ సినిమాకు హనీఫ్ అదేని (Haneef Adeni) దర్శకత్వం వహించగా క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ (Cubes Entertainment )పై షరీఫ్ ముహమ్మద్ (Shareef Muhammed) నిర్మించాడు. యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించగా రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందించాడు.
ఓ మాములు సినిమాగా ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన ఈ చిత్రం అనాడు పెద్ద సంచలనమే సృష్టించింది. ఇండియాస్ మోస్ట్ వయలెంట్ చిత్రంగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగానే వసూళ్లు సాధించి కేరళ బాక్సాఫీస్‌ను షాక్ గురి చేసింది. అయితే.. ఈ మూవీ సీక్వెల్ ఉంటుందా ఉండదా, ఉంటే ఎప్పుడు ప్రారంభిస్తారు అనే టాక్ చాలా రోజులు నడిచాయి.
ఈక్రమంలో మూవీలో శృతి మించిన హింసాత్మక సన్నివేశాల దృష్ట్యా మొదటి భాగానికి చాలామంది ఇబ్బంది పడ్డారని అందుకని సెకండాఫ్ ఇక ఉండదు, హీరో ఇంట్రెస్ట్‌గా లేడు అనే వార్తలు బాగా వచ్చాయి. అదే నిజమని ఇక మార్కో2 ఉండదా అంటూ అనేకమంది ఆ సినిమా లవర్స్ నిరుత్సాహా పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర అభిమానులకు మంచి కిక్ ఇచ్చేలా ఇప్పుడు సరికొత్తగా ఓ కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. దీంతో విషయం తెలిసిన వారు ఎగిరి గంతేస్తున్నారు.
ఇంతకు ఆ విషయం ఏంటంటే.. మార్కో సినిమాకు సీక్వెల్‌గా మార్కో2 అతి త్వరలో పట్టాలెక్కనుందని, పాత దర్శకుడే అదే నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోందనే అంశం పేపర్లతో సహా తెలిసి వచ్చింది. తాజాగా మలయాళ ఫిలిం ఛాంబర్‌లో ఈ సినిమా మేకర్స్ లార్డ్ మార్కో (Lord Marco) పేరుతో సినిమా పేరును రిజిస్టర్ చేయించడంతో ఈ విషయం బయట పడింది. అయితే.. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్ స్థానంలో మరో కొత్త స్టార్ నటిస్తాడని, త్వరలోనే పూర్తి వివరాలు చిత్ర బృందం తెలియజేస్తుందని సమాచారం.
ఇదిలాఉంటే ఈ చిత్ర బృందం ఇటీవలే మార్కో పేరుతో ఓ సోషల్ మీడియా అకౌంట్ ప్రారంభించింది. ఆపై వెంటనే మోహన్ లాల్, మమ్ముట్టి, యష్ వంటి స్టార్ హీరోలను ఫాలో చేయడం స్టార్ట్ చేయడంతో ఈ అప్‌కమింగ్ లార్డ్ మార్కో (Lord Marco) సినిమాలో హారోగా కన్నడ స్టార్ కేజీఎఫ్ యశ్ (Yash) చేయబోతున్నాడనే వార్త తెగ హాల్ చేస్తుంది. నేషనల్ వైడ్‌గా ట్రెండింగ్ అవుతంది. దీనిపై ఇంతవరకు ఎవరు ఎలాంటి అధికారికంగా ప్రకటన లేకున్నప్పటికీ యశ్ అభిమానులు ఓ రేంజ్‌లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మేకర్స్ స్వయంగా రంగంలోకి దిగి వివరాలు తెలిపితే కానీ అప్పటి వరకు అసలు విషయాలు బయటకు రావు.