Trisha: విజయ్.. కల నెరవేరుతుంది
ABN , Publish Date - Sep 09 , 2025 | 04:35 PM
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ (Vijay) రాజకీయ రంగ ప్రవేశంపై సినీ నటి త్రిష (Trisha) స్పందించింది..
కోలీవుడ్ అగ్రహీరో విజయ్ (Vijay) రాజకీయ రంగ ప్రవేశంపై సినీ నటి త్రిష (Trisha) స్పందించింది. ఆయన కోరిక నెరవేరాలని ఆమె ఆకాంక్షించారు. పైగా ఆయన కోరుకునేదానికి పూర్తిగా అర్హుడంటూ విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. దుబాయ్ వేదికగా జరిగిన సైమా వేడుకల్లో పాల్గొన్న త్రిష యాంకర్ అడిగిన ప్రశ్నకు పై విధంగా స్పందించారు. ‘విజయ్ కల నెరవేరాలి. అతని కలలు ఏవైనా కావొచ్చు అవి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఆయన దానికి అర్హుడు’ అంటూ వ్యాఖ్యానించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, చిత్రపరిశ్రమలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్నందుకుగాను త్రిషకు ప్రత్యేక అవార్డుతో సన్మానించారు. ఇదిలా వుంటే గత కొంతకాలంగా విజయ్ - త్రిష మధ్య ఏదో సంబంధం ఉందనే ప్రచారం కోలీవుడ్‌లో సాగుతోంది. వీరిద్దరూ కలిసి ‘లియో’లో నటించిన తర్వాత ఈ పుకార్లు మరింతగా ఎక్కువైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో విజయ్‌ని ఉద్దేశించి త్రిష చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.