Narivetta Telugu Trailer: కేర‌ళ ఆదివాసిల‌పై.. జ‌రిగిన‌ మార‌ణ‌కాండ దృశ్య రూపం

ABN , Publish Date - May 29 , 2025 | 11:17 AM

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ టొవినో థామ‌స్ న‌టించ‌గా ఇటీవ‌ల‌ కేర‌ళ‌లో రిలీజై సంచ‌ల‌నం సృష్టిస్తోన్న చిత్రం న‌రివేట్ట

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ టొవినో థామ‌స్ (Tovino Thomas) న‌టించ‌గా ఇటీవ‌ల‌ కేర‌ళ‌లో రిలీజై సంచ‌ల‌నం సృష్టిస్తోన్న చిత్రం న‌రివేట్ట (Narivetta). గ‌త వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ చిత్రం అక్క‌డ ప్ర‌స్తుతం వ‌ర‌ద‌ల్లో సైతం క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. 2003వ సంవ‌త్స‌రంలో కేర‌ల‌లోని ముత్తంగ అనే ప్రాంతంలో ఆదివాసిల‌పై పోలీసులు జ‌రిపిన ఊచ‌కోత నేప‌థ్యంలో తెర‌కెక్కింది. సూర‌జ్ వెంజ‌రమూడు (Suraj Venjaramoodu), ప్రియంవ‌ద కృష్ణ‌న్ (Priyamvada Krishnan) కీల‌క పాత్ర‌లు పోషించారు. అనురాజ్ మ‌నోహ‌ర్ (Anuraj Manohar) ద‌ర్వ‌క‌త్వం వ‌హించాడు.,

ఇప్పుడీ సినిమాను తెలుగులో విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ (Mythri Movie Makers) తెలుగు రాష్ట్రాల‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం రాత్రి ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌లో నాటి న‌ర మేథం దృశ్యాల‌ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూయించ‌డంతో సినిమా చూసిన వారంతా తీవ్ర భావోద్వేగాల‌కులోన‌య్యారు.

Updated Date - May 29 , 2025 | 11:19 AM