Karthi: అన్నగారు.. నిర్మాత ఇవ్వడం కష్టమే

ABN , Publish Date - Dec 05 , 2025 | 08:39 PM

ఏ ముహూర్తాన కార్తీ (Kaarthi).. వా వాతియార్(Vaa Vaathiyaar) సెట్స్ మీదకు వెళ్లిందో కానీ, ఇప్పటివరకు అది రిలీజ్ కు నోచుకోకుండా పోయింది. ఒకదాని తరువాత ఒకటి.. సమస్యలు వస్తూనే ఉన్నాయి

karthi

Karthi: ఏ ముహూర్తాన కార్తీ (Karthi).. వా వాతియార్(Vaa Vaathiyaar) సెట్స్ మీదకు వెళ్లిందో కానీ, ఇప్పటివరకు అది రిలీజ్ కు నోచుకోకుండా పోయింది. ఒకదాని తరువాత ఒకటి.. సమస్యలు వస్తూనే ఉన్నాయి. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కార్తీ సరసన కృతి శెట్టి(Krithi Shetty) నటిస్తోంది. గత రెండు మూడేళ్ళుగా నేను కూడా ఉన్నాను అన్నట్లు ఒక్కో సాంగ్, పోస్టర్, టీజర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ ఏడాది అయితే ఏకంగా రిలీజ్ డేట్ ను కూడా చెప్పేశారు.

ఎట్టకేలకు వా వాతియార్ డిసెంబర్ 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే పేరుతో వస్తే తెలుగులో అంతగా ఆదరించేరేమో అనుకోని.. కార్తీ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అన్నగారు వస్తారు అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. ఇంకో వారం రోజుల్లో రిలీజ్ ఉంది అనగా మరో సమస్య వచ్చి పడింది. అన్నగారికి బ్రేక్ పడింది.

తాజాగా అన్నగారు వస్తారు లీగల్ మరియు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి ఈ సినిమాపై మద్రాస్ హైకోర్టులో కేసు వేశాడు. ఈ సినిమా నిర్మాత అయిన K.E. జ్ఞానవేల్ రాజా .. అర్జున్ దాస్ వద్ద రూ.10.35 కోట్లు అప్పు తీసుకున్నాడు. అది మొత్తం వడ్డీతో కలుపుకొని రూ. 21.78 కోట్లు అయ్యింది. అయితే ఇంత డబ్బును జ్ఞానవేల్ రాజా ఇవ్వగలడా.. ? అంటే ఇవ్వలేడు అనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కంగువ నుంచే జ్ఞానవేల్ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఆ సినిమాకు కోట్లల్లో ఖర్చు పెట్టాడు.. కచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనుకున్నాడు. కానీ, అది భారీ డిజాస్టర్ ని అందుకుంది. పెట్టిన డబ్బులు కాదు కదా.. అందులో పావు వంతు కూడా వసూలు చేయలేకపోయింది.

అంతేకాకుండా కంగువ పార్ట్ 2 కూడా ఆగిపోయింది. ఇక సూర్య కానీ, నిర్మాత కానీ ఈ విషయంలో ఎక్కువ గొడవ పడలేదు. ఇప్పుడు కార్తీ సినిమా కూడా ఇప్పుడప్పుడే వచ్చింది కాదు. రెండేళ్లుగా ఇది వాయిదాల మీద వాయిదాలు నడుస్తూనే వస్తుంది. కంగువ తరువాత నుంచి జ్ఞానవేల్ రాజాకు ఒక మంచి హిట్ వచ్చింది లేదు. డిసెంబర్ 12 లోపు అంత డబ్బు కట్టే ఛాన్స్ నిర్మాతకు అస్సలు లేదు. ఏదైనా మిరాకిల్ జరిగి అది జరిగితే తప్ప అన్నగారు బయటకు రారు. మరి ఈ వివాదం ఎప్పటివరకు నడుస్తుందో చూడాలి.

Updated Date - Dec 05 , 2025 | 09:48 PM