Thug Life: నో.. సారీ.. కర్ణాటకలో కమల్ సినిమా విడుదల లేనట్టే
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:11 PM
విశ్వ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాష తమిళం నుంచి వచ్చిందన్న ఆయన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి.
విశ్వ నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) తన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్నారు. కన్నడ భాష తమిళం నుంచి వచ్చిందన్న ఆయన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు సూచించినప్పటికీ, కమల్ హాసన్ క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. ఆ విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరించారు. కమల్ క్షమాపణ చెప్పకపోతే కర్ణాటకలో ఈ సినిమా విడుదల కాదని కన్నడ అభిమాన గ్రూపులు, కర్ణాటక ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ (KFCC) స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని కర్ణాటకలో ప్రస్తుతానికి విడుదల చేయకూడదని కమల్‌హాసన్ (Kamal Haasan) నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కమల్ తరఫు న్యాయవాది కర్ణాటక హైకోర్టుకు తెలిపారు. కర్ణాటక హైకోర్టులో ఈ వివాదంపై విచారణ జరిగింది. కమల్ హాసన్ తరపు న్యాయవాది దయాన్ చిన్నప్ప కమల్ కన్నడ భాషను అవమానించలేదన్నారు. ఆయన వ్యాఖ్యలు ప్రేమతో చెప్పినవే అని వాదించారు. అయితే కోర్టు కమల్‌కు కీలక సూచనలు చేసింది. మీరు సామాన్య వ్యక్తి కాదు. మీకు భాషా స్వేచ్ఛ ఉంది, కానీ అది ప్రజల మనోభావాలను గాయపరిచేలా ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది. మాటలు వెనక్కి తీసుకోలేము. కానీ క్షమాపణ చెప్పవచ్చు. కమల్ హాసన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని, అలా చేస్తే వివాదం సద్దుమణుగుతుందని కోర్టు సూచించింది.