Theater Movies: ఈవారం.. సౌత్ ఇండియా వ్యాప్తంగా థియేటర్లలోకి వస్తున్న సినిమాలివే!
ABN , Publish Date - Jun 05 , 2025 | 02:02 PM
ఈ శుక్రవారం సౌత్ ఇండియా వ్యాప్తంగా సినిమాల సందడి ఓ మోస్తరుగానే ఉండనుంది.
ఈ శుక్రవారం సౌత్ ఇండియా వ్యాప్తంగా సినిమాల సందడి ఓ మోస్తరుగానే ఉండనుంది. ముఖ్యంగా కమల్‌హసన్, మణిరత్నం కాంబోలో తెరకెక్కిన థగ్ లైఫ్ కర్ణాటక మినహా ఇతర రాష్ట్రాలలో గురువారం భారీ ఎత్తున రిలీజ్ కాగా మిశ్రమ స్పందనను రాబట్టుకుంటుంది. ఇంత పెద్ద సినిమా విడుదల నేపథ్యంలో తమిళనాట కేవలం మరో రెండు చిత్రాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిలో థగ్ లైఫ్ సినిమా ఒకటి మాత్రమే జూన్5 గురువారం రోజు విడుదలవగా మిగతా అన్నీ భాషల సినిమాలు జూన్ 6 శుక్రవారం రోజునే విడుదల కానున్నాయి.
ఇక హిందీలో.. అక్షయ్ కుమార్ ఇతర బాలీవుడ్ బలగం అంతా కలిసి నటించిన హౌస్‌ఫుల్5, ఇంగ్లీష్‌లో మూడు, మలయాళ, కన్నడ భాషల్లో అర డజన్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఇక అత్యధికంగా తెలుగులో డజన్ సినిమాలు ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తుండడం గమనార్హం. వీటిలో థగ్ లైఫ్ మినహా అన్నీ లో బడ్జెట్ చిత్రాలు కాగా అందులోనూ నార్నే నితిన్ రాజా వారు, సంతోష్ శోభన్ గ్యాంబ్లర్స్ చిత్రాలు మాత్రమే కాస్త తెలిసిన నటులు ఉన్న చిత్రాలు. మిగతావన్నీ చిన్న చిత్రాలే కావడం విశేషం. అయితే ఇవన్నీ స్ట్రెయిట్ తెలుగు సినిమాలే అవడం మరో ప్రత్యేకత.
English
The Life of Chuck Jun 6
Adventure of Jetcat - Combo
Adventure of Iceberg 7D - Combo
Hindi
Thug Life
Housefull 5 Jun 6
Mera Naam Ullhas Hai Part 3 (LLB PASS)
Kannada
Neethi
Maadeva
Sees Kaddi
School Ramayana
College Kalavida
Sanju Weds Geetha 2
Tamil
Thug Life
Madras Matinee
Paramasivan Fathima
Malayalam
Thug Life
Police Day
Thug CR 143/24
Thelivu Sahitham
Abhyanthara Kuttavaali
The Life of Mangrove Jun 6
WrittenAndDirectedbyGod
Telugu
Thug Life Jun 5
Gadhi
Shooter
Gamblers
Badmashulu
Mission 007
Nete Draupadi
Paderu 12 Mile
Lopaliki Ra Chepta
Sri Sri Sri Raajavaru