Theater Movies: ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ర్సెస్ ఫెంటాస్టిక్ ఫోర్! థియేట‌ర్ల‌లో సునామీనే

ABN , Publish Date - Jul 21 , 2025 | 06:19 PM

ఈ వారం సినిమా థియేటర్లలో పెద్ద హంగామా ఉండ‌నుంది. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ కు పోటీగా ‘ఫెంటాస్టిక్ ఫోర్’ కూడా థియేటర్లలోకి రాబోతోంది.

theater movies

ఈ వారం సినిమా థియేటర్లలో పెద్ద హంగామా ఉండ‌నుంది. పవన్ కళ్యాణ్ ఐదేళ్ల గ్యాప్ తర్వాత నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ చివరికి రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో జూలై 26న గ్రాండ్‌గా విడుదల కానుంది. పవన్ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా పండగే!

అంతేగాక‌.. హాలీవుడ్ నుంచి భారీ అంచనాలు ఉన్న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ కూడా అదే వారం థియేటర్లలోకి రాబోతోంది. సూపర్ హీరో సినిమాల కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఇది గుడ్ న్యూస్. ఇక ఇండియన్ యానిమేషన్‌లో మైలురాయి అవుతుందని చెప్పబడుతున్న ‘మహావతార్’ కూడా అన్ని సౌత్ లాంగ్వేజ్‌ల్లో రిలీజ్ అవుతోంది.

తమిళంలో పోటీ:

విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘తలైవన్ తలైవీ’ చిత్రం తమిళంలో రిలీజ్ అవుతుండగా, అదే సినిమా తెలుగులో ‘సర్ మేడమ్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రోవైపు కామెడీ కింగ్ వడివేలు మరియు విల‌క్ష‌ణ న‌టుడు ఫహాద్ ఫాజిల్ కలసి నటించిన ‘మారీషన్’ కూడా తమిళనాడు, కేరళలో విడుదల అవుతోంది.

వీటితో పాటు తమిళం, బాలీవుడ్, కన్నడ, మలయాళంలోనూ రెండు చిత్రాలు చొప్పున ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇదిలాఉంటే.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి ఫోకస్ మాత్రం హరిహర వీరమల్లు మరియు ఫెంటాస్టిక్ ఫోర్ మీదే ఉంది. చివరికి ఏ సినిమా బాక్సాఫీస్‌లో విజయం సాధిస్తుందో చూడాలి!

Tamil

Hari Hara Veera Mallu - Part 1 Sword vs Spirit

Gift

Maareesan

Naalai Namadhe

Thalaivan Thalaivii

Mahavatar Narsimha

The Fantastic Four: First Steps

Hari Hara Veera Mallu

Kannada

Hari Hara Veera Mallu - Part 1 Sword vs Spirit

Bandook

Su From So

Mahavatar Narsimha

Mahavatar Narsimha

Malayalam

Hari Hara Veera Mallu - Part 1 Sword vs Spirit

Mahavatar Narsimha

Oru Ronaldo Chithram

Telugu

Hari Hara Veera Mallu - Part 1 Sword vs Spirit

Sir Madam

Mahavatar Narsimha

The Fantastic Four: First Steps

The Fantastic Four

Hindi

Rasa

So Long Valley

Mahavatar Narsimha

The Fantastic Four: First Steps

Hari Hara Veera Mallu - Part 1 Sword vs Spirit Jul 24

English

The Fantastic Four: First Steps

Updated Date - Jul 21 , 2025 | 06:20 PM