Coolie: కూలీలో ఈ మూడు క్లిక్ అయితే కొట్టేవాడు లేడంట..
ABN , Publish Date - Aug 10 , 2025 | 08:22 PM
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ (Coolie). ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెల్సిందే.
Coolie: సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూలీ (Coolie). ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెల్సిందే. నిజం చెప్పాలంటే కూలీ కోసం తెలుగు ప్రేక్షకులు మరింత ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణం అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). మొట్ట మొదటి సారి నాగ్ విలన్ గా నటిస్తున్నాడు. నాగ్ తో పాటు ఉపేంద్ర, ఆమీర్ ఖాన్, సత్యరాజ్, శృతి హాసన్ లాంటి స్టార్స్ అందరూ ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
కూలీ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. లోకేష్ ట్రాక్ రికార్డ్ గురించి అందరికీ తెల్సిందే. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా పరాజయాన్ని అందుకోలేదు. ఇక ఇప్పుడు రజినీతో సినిమా అనేసరికి అందరి చూపు కూలీమీదనే పడింది. ఇక ఇప్పుడు కూలీ సినిమా హిట్ అవ్వడానికి మూడు ఘట్టాలు ఉన్నాయి. అవి కనుక క్లిక్ అయితే కూలీ హిట్ ను ఆపడం ఎవరి వలన కాదని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ మూడు అంశాలు ఏంటి.. ? అనేది తెలుసుకుందాం.
మొదటిది ఇంటెర్వెల్. ప్రతి సినిమాకు ఇంటెర్వెల్ అనేది కీలకం. అది ట్విస్ట్ లతో ఉంటేనే.. సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. కూలీలో ఇంటెర్వెల్ హైలైట్ అని టాక్. కూలీగా ఉన్న దేవా అసలు ఎవరు.. ? అనేది నెక్స్ట్ లెవెల్ లో లోకేష్ చూపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. ఇదే మొదటి ఘట్టం. ఇది కనుక బాగా క్లిక్ అయితే సినిమా సగం హిట్ అయ్యినట్టే అని చెప్పుకొస్తున్నారు. ఇక రెండోది సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్. మొదటి నుంచి కూలీ టీజర్, ట్రైలర్ లో దేవాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్లు చూపించారు.
రజినీ ఫ్లాష్ బ్యాక్ లో వింటేజ్ లుక్ తో కనిపించబోతున్నాడట. మునుపెన్నడూ చూడని ఒక ట్విస్ట్ ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఉండబోతుందంట. ఇది కనుక క్లిక్ అయితే కూలీ హిట్ ను ఆపడం ఎవరి వలన కాదని అంటున్నారు. ఇక మూడోది క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ నుంచే ఎవరూ సీట్ మీద కూర్చోరని అంటున్నారు. నాగార్జున విశ్వరూపం బయటపడినప్పటి నుంచి ఆమీర్ ఖాన్ ఎంట్రీ.. వారు రజినీతో యుద్ధం వరకు వర్త్ అంట వర్మ ... వర్త్. ఇలా ఈ మూడు ఘట్టాలే కూలీ సినిమాకు ప్రధానం అని చెప్పుకొస్తున్నారు. లోకేష్ తన టేకింగ్ తో పాటు.. ఎలివేషన్స్ తో అదరగొట్టాడట. మరి ఇవన్నీ నిజమో కాదో తెలియాలంటే ఆగస్టు 14 న కూలీ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.
Ester Anil: బీచ్ ఒడ్డున బికినీలో వెంకటేష్ రీల్ కూతురు.. కాక పెట్టిస్తుందిగా
Monday Tv Movies: సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో టెలీకాస్ట్ అయ్యే సినిమాలివే