Serial Actress: సీరియల్ నటికి వేధింపులు.. నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Nov 05 , 2025 | 06:56 AM
తెలుగు, కన్నడ సీరియల్ నటి సోషల్ మీడియాలో వేధింపులకు గురైన ఘటన బెంగుళూరులో చోటుచేసుకుంది.
ఓ వ్యక్తి తనను సోషల్‌మీడియాలో లైంగికంగా.. మానసికంగా వేధిస్తున్నాడంటూ తెలుగు, కన్నడ భాషల్లో నటిస్తున్న ఓ సీరియల్ నటి పోలీసులను ఆశ్రయించారు. ఫేస్‌బుక్‌లో ఆ వ్యక్తి పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించలేదనే కక్షతో తనను ఇబ్బందిపెడుతున్నాడంటూ ఫిర్యాదు చేసింది. బెంగుళూరులోని అన్నపూర్ణేశ్వరీ నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నవీన్ అనే వ్యక్తి నుంచి బాధితురాలికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఆమె అంగీకరించలేదు. పలుసార్లు ఆమె ఇలానే తిరస్కరించడంతో ఆ నటికి అభ్యంతకర వీడియోలు పంపడం మొదలు పెట్టాడు. నటి బ్లాక్ చేసినా ఆగకుండా వేరే అకౌంట్ల నుంచి అభ్యంతకర వీడియోలు, మెసేజులు పంపి వేధించేవాడు. దీంతో నటి పోలీసులకు ఫిర్యాదు చేశారు.