Suhas: సుహాస్ తొలి తమిళ సినిమా.. ‘మండాడి’ ఫస్ట్ లుక్! అదిరిపోయింది
ABN , Publish Date - May 05 , 2025 | 06:28 PM
ప్రస్తుతం తెలుగులో మూడు నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన ఫస్ట్ టైం తమిళంతో ఎంట్రీ ఇస్తూ నటిస్తోన్న చిత్రం మండాడి. తాజాగా మేకర్స్ ఈ మూవీ నుంచి సుహాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
గత సంవత్సరం అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్, శ్రీరంగ నీతులు, జనక అయితే గనక, ప్రసన్న వదనం, గొర్రు పురాణం అంటూ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుహాస్ (Suhas). ప్రస్తుతం తెలుగులో మూడు నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన ఫస్ట్ టైం తమిళంతో ఎంట్రీ ఇస్తూ నటిస్తోన్న చిత్రం మండాడి (Mandadi).
సూరి (Soori) ప్రధాన హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మహిమా నంబియార్ (Mahima Nambiar) కథానాయికగా చేస్తోండగా పాన్ ఇండియాగా సినిమాను రూపొందిస్తున్నారు. సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది (Mathimaran Pugazhendhi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే టైటిల్, సూరి ఫస్ట్ లుక్ విడుదల చేసిన నిర్మాతలు, తాజాగా సుహాస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. లుంగీ ధరించి, నెరిసిన జుట్టుతో, జెర్సీ వేసుకుని "సునామీ రైడర్స్" బృందంతో సముద్రతీరంలో నిలిచిన సుహాస్ రూపం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరో పోస్టర్‌లో సూరి, సుహాస్ ఇద్దరూ స్వయంగా పడవలు నడుపుతూ ఒకరిపై ఒకరు సీరియస్‌గా కనిపించడం ఆసక్తికరంగా ఉంది.
అయితే క్రీడా నేపథ్యం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుహాస్ (Suhas) బలమైన ప్రతినాయకుడిగా నటిస్తుండడం విశేషం. ఇంకా ఈ మూవీలో సత్యరాజ్, రవీంద్ర విజయ్, అచ్యుత్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించనుండగా జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం అందస్తున్నాడు.