Kalaimamani Awards: సాయి పల్లవికి.. తమిళ అత్యున్నత పురస్కారం
ABN , Publish Date - Sep 25 , 2025 | 09:16 AM
ఎట్టకేలకు తమిళనాడు (TamilNadu) కలై మామణి (Kalaimamani) పురస్కారాలకు కదలిక వచ్చింది.
ఎట్టకేలకు తమిళనాడు (TamilNadu) కలై మామణి (Kalaimamani) పురస్కారాలకు కదలిక వచ్చింది పలు తర్జనభర్జ నల అనంతరం ప్రతి యేటా టీవీ, సినిమా రంగాల కళాకారులకు అందజేసే 'కలైమామణి అవార్డులను బుధవారం తమిళనాడు రాష్ట్ర సంగీత సాహిత్య నాటక అకాడమీ (తమిళ నాడు ఇయల్ ఇసై వాడగ మండ్రం) ప్రకటించింది. 2021 2022, 2023 సంవత్సరాలకుగాను కలైమామణి, భారతీయార్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలసరస్వతి పేర్లతో ఇచ్చే అవార్డులకు ఎంపికైన వారి పేర్లను వెల్లడించింది.
ఈ అవార్డులను వచ్చే నెలలో ముఖ్యమంత్రి స్టాలిన్ (Stalin) అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో ప్రదానం చేస్తారు. ఈ అకాడమీ ప్రతి యేటా అర్హులైన వారిని అవార్డులకు ఎంపిక చేసి ప్రధానం చేయడం ఆనవా యితీ అయితే, గత మూడేళ్లుగా ఈ అవార్డులను ప్రకటించ లేదు. ఇదే విషయంపై సినీ ప్రముఖులు సీఎం స్టాలిన్‌ను కలిసి ఆవార్డులను ప్రకటించాలని పలుమార్లు విన్నవించారు. ఈ నేపథ్యంలో గత మూడేళ్ళకు సంబంధించిన అవార్డుల న్నింటీ ప్రభుత్వం ప్రకటించింది.
'కలైమామణి' అవార్డు గ్రహీతలకు 3 సవర్ల బంగారు పతకు, జ్ఞాపిక అందజేస్తారు. అలాగే, ఖారతీయార్, ఎంఎస్ సుబ్బులక్ష్మి, బాలసరస్వతి స్మారకార్థం ప్రత్యేక అవార్డులను ప్రదానం చేస్తారు. భారతీ యార్ అవార్డు (సాహిత్యం)ను నమురుగేశ పాండియన్, ఎంఎస్ సుబ్బులక్ష్మి ఆవార్డు (సంగీతం)ను పద్మభూషణ్ డాక్టర్ కేజే ఏసుదాస్ (K. J. Yesudas), బాలసరస్వతి ఆవార్డు (నాటకం)ను పద్మశ్రీ ముత్తు కన్నమ్మాళ్లకు ప్రదానం చేయనున్నారు. వీరికి లక్ష రూపాయల నగదు, 3 సవర్ల బంగారు పతకాన్ని బహూ కరిస్తారు. అదేవిధంగా సంగీతం, సాహిత్య రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు కూడా కలైమామణి అవార్డును ప్రక టించారు. ఈ అవార్డులకు ఎంపికైన వారిలో చిత్రపరిశ్రమకు చెందిన వారి వివరాలు.
అవార్డు.. గ్రహీతలు వీరే
2021 సంవత్సరానికి..
హీరోయిన్ సాయిపల్లవి ( Sai Pallavi) (సినిమా)
ఎస్ జే సూర్య (S J Suryah) (సినిమా)
పూచ్చి మురుగన్ (నాటకం)
లింగుస్వామి (సినీ దర్శకుడు)
సూపర్ సుబ్బరాయన్ (Super Subbarayan) (స్టంట్ మాస్టర్)
బీకే కమలేష్ (బుల్లితెర నటుడు)
ఎంపి విశ్వనాథన్ (సంగీత, నాటక నటుడు)
2022 సంవత్సరానికి..
విక్రమ్ ప్రభు (Vikram Prabhu) (సినిమా)
జయ వీసీ గుహనాథన్ (సినీ నటి)
వివేకా (సినీ గేయరచయిత)
డైమండ్ బాబు (సినీ పీఆర్వో)
టి. లక్ష్మీనాథన్ (సినీ ఫొటోగ్రాఫర్)
గాయత్రి (బుల్లితెర నటి)
2023 సంవత్సరానికి..
అనిరుధ్ (Anirudh Ravichander) (సినీ సంగీత దర్శకుడు)
శ్వేతా మోహన్ (Shweta Mohan) (నేపథ్య గాయని)
సంతోష్ కుమార్ (SANDY) (కొరియోగ్రాఫర్)
నిఖిల్ మురుగన్ (సినీ పీఆర్వో)
ఉమా శంకర్ (టీవీ యాంకర్).