ఒకేరోజు.. ఢీకొంటున్న ముగ్గురు కమెడియన్లు...
ABN, Publish Date - May 14 , 2025 | 09:52 AM
తమిళనాట ఈ వారం థియేటర్లలో చాలా ఆసక్తికరమైన పోటీ నెలకొంది. ముగ్గురు టాప్ కమెడియన్లు హీరోలుగా నటించిన చిత్రాలు ఒకే రోజు విడుదలవుతుండం విశేషం.
తమిళనాట ఈ వారం థియేటర్లలో చాలా ఆసక్తికరమైన పోటీ నెలకొంది. మాములుగా అయితే పండుగలు, సెలవుల సమయాల్లో భారీ , పెద్ద స్టార్ల సినిమాలు ఒక దానితో పోటీ పడి మరోటి ఒకే సారి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ హంగామా చేసేవి. కానీ ఇప్పుడు ఆ శుక్రవారం తమిళ బాక్సాపీస్ వద్ద పెద్ద పేరున్న హీరోల చిత్రాలు కాకుండా ముగ్గురు టాప్ కమెడియన్లు హీరోలుగా నటించిన చిత్రాలు విడుదలవుతుండం విశేషం.
వీటిలో ప్రధానంగా డీడీ అంటూ వరుస హర్రర్, కామెడీ చిత్రాలతో వస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంతానం (Santhanam) హీరోగా నటించిన డీడీ నెక్స్ట్ లెవల్ (DD Next Level) సినిమా ఉండగా మరోవైసు ఇప్పటికే విడుదల, గరుడన్, వంటి చిత్రాలతో హీరోగా సెటిల్ అయిన సూరి (Soori) నటించిన మామన్ (Maman), ఇక అందరికీ సుపరిచితమైన యోగిబాబు (YogiBabu) మెయిన్ లీడ్‌గా నటించిన ‘జోరా కై తట్టుంగ’ (JoraKaiyaThattunga) మూవీలు ఉన్నాయి. అయితే వీటిలో సంతానం నటించిన డీడీ నెక్స్ట్ లెవల్ (DD Next Level) సినిమాను ప్రముఖ నిహారికా ఫిలింస్ తెలుగులోను అనువదించి విడుదల చేస్తుండడం విశేషం.
ఈ ముగ్గురు హస్యనటులుగా తమిళ నాట దశాబ్ద కాలంగా టాప్ పోజిషన్‌లో ఉంటూ తమకంటూ ఓ ప్రత్యేకతను దక్కించుకున్నారు. అలాంటిది ఈ ముగ్గురు హాస్యనటుల చిత్రాలు యాదృశ్చికంగా ఈ నెల 16నే విడుదల అవుతుండడం ఇప్పడు ప్రాధాన్యం సంతరించకుంది.
సంతానం నటించిన ‘డీడీ నెక్స్ట్‌లెవల్’ కామెడీ హార్రర్ జానర్ కాగా, సూరి నటించిన ‘మామన్’ ఫ్యామిలీ సెంటిమెంట్‌తో కూడిన చిత్రం, యోగిబాబు నటించిన ‘జోరా కై తట్టుంగ’ చిత్రం క్రైమ్ థ్రిల్లర్. ఈ ముగ్గురి చిత్రాలపై తమిళనాట ప్రేక్షకుల్లోచాలా ఆసక్తి ఉండగా ఆ పోటీలో ఎవరు విజయం సాధిస్తారనే అంశం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరో రెండు రోజుల్లో ఈ ఫలితం తేలనుంది.