Ajith Kumar: నేను.. ఎదగకుండా ఆపే ప్రయత్నం చేశారు

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:28 PM

తాను పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నానని, కార్‌ రేసింగ్‌లో మన దేశం గర్వపడేలా చేస్తానని అగ్ర నటుడు అజిత్‌ కుమార్ పేర్కొన్నారు.

తాను పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతున్నానని, కార్‌ రేసింగ్‌లో మన దేశం గర్వపడేలా చేస్తానని అగ్ర నటుడు అజిత్‌ కుమార్ (Ajith Kumar) పేర్కొన్నారు. ఆయన చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 33 యేళ్ళు పూర్తి చేసుకున్న శుభసందర్భంలో ఒక ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘జీవితంలో ఎన్నో మానసిక ఒత్తిడిలు, ఎదురు దెబ్బలు, వైఫల్యాలు నిరంతరం పరీక్షించాయి. వాటన్నింటినీ ఎదుర్కొంటూనే ముందుకు సాగాను. అన్నింటినీ భరించి పడిలేచిన కెరటంలా మరింత ఉత్సాహంతో ముందుకు వెళుతున్నాను. సినిమాల్లో వరుస పరాజయాలు ఎదురై.. ఇక విజయం ఊహించలేనని అనుకున్న ప్రతిసారి అభమానుల ప్రేమే నన్ను ప్రోత్సహించింది.

Ajith Kumar

మోటార్‌ రేసింగ్‌లో శారీరకంగా దెబ్బలు తగిలాయి. అక్కడ కూడా నన్ను ఎదగనీయకుండా ఆపేందుకు ఎందరో ప్రయత్నించారు. అవమానించారు. పరీక్షలు పెట్టారు. కానీ, పతకాలు సాధించే స్థాయికి చేరుకున్నాను. దీనింతటికీ మీ ప్రేమాభిమానాలే కారణం. అంతేగాక నా భార్య షాలిని లేకుంటే ఇదంతా సాధ్యమయ్యేది కాదు. ఆమె ఎపుడూ నా వెంటే నిలిచివుంది. ఇక అభిమానుల ప్రేమ మాటల్లో వర్ణించలేనిది. మీ ప్రేమను ప్రతి క్షణం ఆస్వాదిస్తూనే ఉంటాను. 33 యేళ్ళుగా మీరు నన్ను, నాలోని లోపాలను అన్నింటినీ అంగీకరించారు. మీతో ఎప్పటికీ నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాను. మోటార్‌ రేసింగ్‌లోనూ మనదేశం గర్వపడేలా చేస్తానని మాట ఇస్తున్నాను’ అని అజిత్‌ కుమార్‌ పేర్కొన్నారు.

Ajith Kumar

Updated Date - Aug 05 , 2025 | 01:41 PM