Janaki vs State of Kerala: తెలుగులోనూ.. 'జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ’

ABN , Publish Date - Jul 04 , 2025 | 10:58 AM

కేంద్ర మంత్రి సురేష్‌ గోపి, అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రల్లో న‌టించిన చిత్రం 'జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ’తెలుగులోనూ విడుద‌ల‌కు రెడీ అవుతోంది.

Janaki vs State of Keral

మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేష్‌ గోపి(Suresh Gopi), అనుపమా పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కీలక పాత్రల్లో కాస్మోస్‌ ఎంటర్టైన్మెంట్స్‌పై జె.ఫణీంద్ర కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం 'జానకి వర్సెస్‌ స్టేట్ ఆఫ్‌ కేరళ’ (Janaki vs State Of Kerala) (జె.ఎస్‌.కె). ప్రవీణ్‌ నారాయణ దర్శకత్వంలో కేర‌ళ‌లో జ‌రిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో బైజు సందోష్‌, మాధవ్‌ సురేష్‌ గోపి, దివ్య పిళ్లయి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇంటెన్స్‌ కోర్టు డ్రామాగా  రూపొందుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ సినిమాలో జానకి పాత్రలో నటించింది. (Janaki vs State of Kerala)

జానకి త‌న‌కు జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఎలా ఎదుర్కొందన్న అంశం ప్ర‌ధానాంశంగా పూర్తి ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందించారు. అయితే జూన్‌ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండ‌గా పేరులో సీత దేవికి మ‌రో పేరైన జాన‌కి ఉండ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ నిరాకరించడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా ప‌డ‌డ‌మే కాక‌  చర్చనీయాంశంగా మారింది. దీంతో మేక‌ర్స్ కేర‌ళ హైకోర్టు (Kerala High Court)ను ఆశ్ర‌యించ‌గా సినిమా చూసిన అనంత‌రం నిర్ణ‌యిస్తామ‌ని వెళ్ల‌డించారు.

Janaki vs State of Kerala,

అయితే.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులోనూ విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైల‌ర్‌ను సైతం రిలీజ్ చేయ‌గా త‌క్కువ స‌మ‌యంలోనే మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. పైగా సురేశ్ గోపికి రెండు తెలుగు రాష్ట్రాల‌లోనూ ఎప్ప‌టి నుంచో ప్ర‌త్యేక‌ ఫ్యాన్ బేస్ ఉండ‌డం, దానికి తోడు అనుప‌మ కూడా తోడ‌వ‌డంతో ఈ చిత్రం ఇక్క‌డా కూడా మంచి ప్రేక్ష‌క‌కాద‌ర‌ణ‌ను పొందే అవ‌కాశం ఉంది. అయితే కోర్టు తీర్పు త‌ర్వాతే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడ‌నేది తేల‌నుంది.

Updated Date - Jul 04 , 2025 | 11:22 AM