Coolie: కూలీ వ‌చ్చేస్తున్నాడు.. 100 డేస్ కౌంట్‌డౌన్ షురూ!

ABN , Publish Date - May 06 , 2025 | 07:53 PM

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో రూపొందుతున్న‌ చిత్రం కూలీ. ఆగ‌ష్టు14న థియేట‌ర్ల‌లోకి రానుంది.

coolie

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ (Rajinikanth) 171 చిత్రంగా డైరెక్ట‌ర్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ (Lokesh Kanagaraj) క‌ల‌యిక‌లో రూపొందుతున్న‌ చిత్రం కూలీ (Coolie). భారీ బ‌డ్జెట్‌తో ఎన్నో అంచ‌నాల మ‌ధ్య రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna Akkineni), ఉపేంద్ర (Upendra), షౌబిన్ (Soubin Shahir), స‌త్య‌రాజ్(Sathya Raj), శృతిహాసన్ (Shruti Haasan) వంటి స్టార్లు ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఏడాది కాలంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ కూలీ (Coolie) చిత్రం అగ‌ష్టులో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాను స‌న్ పిక్చ‌ర్స్ (Sun Pictures) నిర్మించ‌గా అనిరుధ్ ర‌విచంద‌ర్ (Anirudh Ravichander) సంగీతం అందించాడు.

అయితే సినిమా ఆగ‌ష్టు14న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ క్ర‌మంలో కౌంట్‌డౌన్ 100 డేస్ అంటూ మేక‌ర్స్ తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ సినిమామాపై అంచ‌నాలు పెంచేదిగా ఉన్న‌ప్ప‌టికీ ఎవ‌రి ముఖం క‌నిపించ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం విశేషం.

Updated Date - May 06 , 2025 | 07:53 PM