Su From So Raj B Shetty: థియేటర్ ఎంట్రన్స్‌లో.. నేలపై కూర్చున్న హీరో
ABN , Publish Date - Aug 10 , 2025 | 07:37 AM
రెండు వారాల క్రితం ఓ అనామక చిత్రంగా కన్నడలో రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోన్న చిత్రం సూ ఫ్రం సో.
రెండు వారాల క్రితం ఓ అనామక చిత్రంగా కన్నడలో రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోన్న చిత్రం సూ ఫ్రం సో (Su From So). కేవలం రూ. 10 కోట్లు లోపు బడ్జెట్‌లోపే తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే రూ. 80 కోట్లు కాబట్టి కన్నడ నాట సరికొత్త రికార్డులను తిరగరాస్తుంది. తాజాగా రెండు రోజుల క్రితం తెలుగులోనూ అనువాదమై విడుదలైన ఈ మూవీ ఇక్కడ అదే విజయ పరంపరను కొనసాగిస్తోంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో రిలీజ్ చేయడంతో ఇంకా ప్రచారం లభించింది.
జేపీ తుమ్మినాడ్ (JP Thuminad) హీరోగా నటించి దర్వకత్వం వహించగా కన్నడ అగ్ర నటుడు, దర్శకుడు రాజ్ బీ శెట్టి (Raj B Shetty) ఈ చిత్రాన్ని నిర్మించడంతో పాటు ఓ కీలక పాత్రలో నటించాడు. అయితే సినిమా ప్రమోషన్ కోసం ఈ సినిమా టీం తెలుగులో అనేక ఇంటర్వ్యూలు, ఇతర ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ మూవీ ప్రమోషన్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ బీ శెట్టి కొన్ని థియటర్లకు సైతం వెళ్లి ప్రేక్షకుల స్పందనను స్వయంగా చూడడమే కాక వారితో ఇంట్రాక్ట్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం రాత్రి.. ప్రేక్షకుల రియాక్షన్ కనులారా చూద్దామని రాజ్ బీ శెట్టి (Raj B Shetty) హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఏంబీ సినిమాస్ మల్టీఫ్లెక్స్‌కు వెళ్లారు. అప్పటికే థియేటర్ హౌస్‌ఫుల్ అవడం, అక్కడ ఇంకా సినిమా నడుస్తుండడంతో మధ్యలో వారిని డిస్ట్రబ్ చేయడం బావుండదని నిశ్చయించుకుని అక్కడ ఎంట్రన్స్ లో నేలపైనే కూర్చోని సినిమా పూర్తయ్యే వరకు వేచి ఉన్నారు. ఇది కాస్త అక్కడ ఉన్నవారొకరు గమనించి ఫొటో తీసి ఆ తర్వాత సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది.
రాజ్ బీ శెట్టి (Raj B Shetty) అంతపెద్ద స్టార్ అయిండి ఏమీ లేని వాడిలా అలా నేలపై కేర్చోని ఉండడంపై సర్వత్రా షాక్ అవుతున్నారు. అంత ఎత్తుకు ఎదిగినా ఇంకా సామాన్యుడిలా ఉండడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాపై అతనికున్న ఫ్యాషన్‌ను, నిబద్దతను కొనియాడుతున్నారు. మరికొందరు అయనో హీరో, దర్శకుడు, ఓ పెద్ద రచయిత అని ఎవరైనా గుర్తు చేయండయ్యా అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.