Sreeleela: ఇక ఆ 'పరాశక్తి'నే కాపాడాలమ్మా..

ABN , Publish Date - Nov 02 , 2025 | 08:33 PM

అదృష్టం ఆవగింజ అయితే.. దరిద్రం దబ్బకాయంత అనే సామెతలా ఉంది ప్రస్తుతం హాట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కెరీర్.

Sreeleela

Sreeleela: అదృష్టం ఆవగింజ అయితే.. దరిద్రం దబ్బకాయంత అనే సామెతలా ఉంది ప్రస్తుతం హాట్ బ్యూటీ శ్రీలీల (Sreeleela) కెరీర్. పెళ్లి సందD సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ భామ.. మొదటి సినిమా రిలీజ్ అవ్వకముందే వరుస అవకాశాలను అందుకొని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఇక ఈ సినిమా హిట్ అవ్వకపోయినా ఆ తరువాత వచ్చిన ధమాకా తో భారీ విజయాన్ని అందుకుంది. దీంతో గోల్డెన్ లెగ్ అనుకోని కుర్ర హీరోలందరూ క్యూ కట్టారు. కానీ, ఏం ప్రయోజనం శ్రీలీల కెరీర్ లో ధమాకా తప్ప ఇప్పటివరకు ఒక్క హిట్ అందుకున్నది లేదు. హిట్ లేదు కదా అని అవకాశాలు ఏమైనా తగ్గాయా అంటే అది లేదు.. వరుస ఛాన్స్ లు పడుతూనే ఉంది.

స్కంద, ఆదికేశవ, గుంటూరు కారం, ఎక్స్ ట్రాడినరి మ్యాన్, రాబిన్ హుడ్, జూనియర్.. ఇలా ఈ చిన్నది అడుగుపెట్టిన ప్రతి సినిమా ప్లాప్ బాట పట్టింది. మధ్యలో భగవంత్ కేసరి హిట్ అయినా అది బాలయ్య ఖాతాలోకి పోతుంది. ఇక పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ తో డ్యాన్సర్ గా మంచి హిట్ అందుకుంది. ఇక ఈ మధ్యనే మాస్ జాతర అంటూ వచ్చింది. ధమాకా కాంబో కదా అని అంచనాలు పెట్టుకొని మరీ వెళ్లిన ప్రేక్షకులకు రవితేజ - శ్రీలీల మరోసారి నిరాశనే మిగిల్చారు.

ప్రస్తుతం శ్రీలీల ఆశలన్నీ పరాశక్తి మీదనే పెట్టుకుంది. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అధర్వ, రవి మోహన్, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటివరకు పాటలు, రొమాన్స్ కి పరిమితమైన శ్రీలీల ఇందులో మంచి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలనే క్రియేట్ చేశాయి. ఈ సినిమా కూడా పరాజయం అందుకుంది అంటే ఇక శ్రీలీల కెరీర్ అగమ్యగోచరంగా మారుతుంది అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాతోనైనా ఈ చిన్నది విజయాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.

Updated Date - Nov 02 , 2025 | 08:33 PM