Sonu nigam: సోనూ నిగమ్‌పై కేసు నమోదు.. స్పందించిన గాయకుడు
ABN, Publish Date - May 05 , 2025 | 06:22 PM
తాజాగా బెంగళూరులో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో (Music Concert) భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ గాయకుడు సోనూనిగమ్‌పై (Sonu Nigam) కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు
తాజాగా బెంగళూరులో జరిగిన మ్యూజిక్ కాన్సర్ట్‌లో (Music Concert) భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ గాయకుడు సోనూనిగమ్‌పై (Sonu Nigam) కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కర్ణాటక రక్షణ వేదిక’ బెంగళూరు సిటీ యూనిట్ అధ్యక్షుడు ధర్మరాజ్ (Dharma Raj) ఇచ్చిన ఫిర్యాదు మేరకు సింగర్‌పై కేసు నమోదైంది. వారంలోగా ఇన్వెస్టిగేషన్‌కు హాజరు కావాలంటూ బెంగళూరు పోలీసులు సోనూకి గాయకుచి?కి నోటీసులు జారీ చేశారు. మరోవైపు, సోనూపై ‘కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ బ్యాన్ విధించినట్టు తెలిసింది. దీనిపై సోనూనిగమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘‘కర్ణాటకలో ఉన్నప్పుడే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా కర్ణాటక రాష్ట్రం, కన్నడ భాష, సంస్కృతి, సంగీతం, కళాకారులపై ఎంతో ప్రేమ చూపించా. హిందీ కంటే ఎక్కువగా కన్నడ పాటలనే ఆస్వాదిస్తా. కర్ణాటకలో నిర్వహించే నా ప్రతి కాన్సర్ట్‌కు సంబంధించి కన్నడ పాటల ప్రాక్టీస్‌కే ఎక్కువ సమయం కేటాయిస్తాను. నా వయసులో సగం ఉన్న ఓ వ్యక్తి వేలాదిమంది ముందు బెదిరించడం సరికాదు. పైగా అప్పటికి నేను ఒక్క పాటే పాడాను. అతడు మరికొందరిని రెచ్చగొట్టాడు. ‘ఇప్పుడే కదా షో మొదలైంది. ప్లాన్ ప్రకారం వెళుతున్నా’ అని మర్యాదపూర్వకంగా చెప్పాను. ముందుగా ఎంపిక చేసుకున్న లిస్ట్ మేరకు సింగర్స్, టెక్నిషియన్స్ సిద్థమై ఉంటారు. అప్పటికప్పుడు వేరే సాంగ్స్ పెర్ఫామ్ చేయాలంటే ఎలా? అక్కడ తప్పు ఎవరిది?’’ అని ఆయన ప్రశ్నించారు.
‘‘దేశభక్తి కలిగిన వ్యక్తిగా.. పహల్గాం దాడి తర్వాత ఎవరైనా భాష, మతం, కులం పేరుతో విమర్శలు చేయాలని చూస్తుంటే అలాంటి వారిని నేను ద్వేషిస్తున్నా. ఏది మంచో ఏది చెడో చెప్పే ప్రయత్నం చేశా. అక్కడితో వివాదానికి తెరపడింది. గంటకుపైగా కన్నడ పాటలే పాడా. సంబంధిత వీడియోలన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయి. అక్కడ తప్పు ఎవరిదో నిర్ణయించుకోవాలన్నది కర్ణాటక ప్రజలకే వదిలేస్తున్నా. వారి తీర్పును నేను అంగీకరిస్తాను. కర్ణాటక పోలీసులు, న్యాయ వ్యవస్థలను నేను గౌరవిస్తా’’ అని పేర్కొన్నారు.