Sivakarthikeyan: వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఎస్‌కే..

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:15 PM

విజయంతమైన చిత్రాలతో వరుస చిత్రాల్లో నటిస్తున్న హీరో శివకార్తికేయన్‌ (ఎస్‌కే). ‘ది గోట్‌’ ఫేం వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నటించనున్నారు.

Sivakarthikeyan - Venkat Prabhu

విజయంతమైన చిత్రాలతో వరుస చిత్రాల్లో నటిస్తున్న హీరో శివకార్తికేయన్‌ (Sivakarthikeyan). ‘ది గోట్‌’ ఫేం వెంకట్‌ ప్రభు (venkat Prabhu) దర్శకత్వంలో నటించనున్నారు. ఈ ప్రాజెక్టుపై దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ, ‘శివకార్తికేయన్‌ కథానాయకుడిగా తాను దర్శకత్వం వహించే చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. వచ్చే యేడాది జనవరిలో చిత్రీకరణ ప్రారంభమతుంది. ఇది వైవిధ్యభరితమైన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ. ఇందులో హీరోను సరికొత్త  లుక్‌లో చూస్తారు. ఈ ప్రాజెక్టులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు, నిర్మాణ సంస్థ, సంగీత దర్శకుడు తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు. 

కాగా, ప్రస్తుతం శివకార్తికేయన్‌ తన 25వ చిత్రం ‘పరాశక్తి’లో నటిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘డాన్‌’ ఫేం సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఎస్‌కే నటిస్తారు. ఆ తర్వాత వెంకట్‌ ప్రభుతో కలిసి పనిచేయనున్నారు.  

Updated Date - Oct 14 , 2025 | 12:17 PM