Parasakthi: ప్రభాస్ తో పోటీకి సై అన్న శివకార్తికేయన్.. గెలవడానికేనా

ABN , Publish Date - Dec 22 , 2025 | 09:25 PM

ఈ సంక్రాంతి నిరుడు లెక్క ఉండదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్టార్ హీరోల సినిమాలు అన్ని సంక్రాంతికే దిగుతున్నాయి. అందులో మేము కూడా ఉన్నాం అంటూ డబ్బింగ్ సినిమాలు కూడా తమ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి.

parasakthi

Parasakthi: ఈ సంక్రాంతి నిరుడు లెక్క ఉండదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్టార్ హీరోల సినిమాలు అన్ని సంక్రాంతికే దిగుతున్నాయి. అందులో మేము కూడా ఉన్నాం అంటూ డబ్బింగ్ సినిమాలు కూడా తమ డేట్ ను కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. తెలుగుకు వారికి సంక్రాంతి ఎంత పెద్ద పండగో అందరికీ తెలిసిందే. ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవడం అంటే మాటలు కాదు. అందుకే స్టార్ హీరోలు, కుర్ర హీరోలు.. వేరే భాష హీరోలు కచ్చితంగా ఈ పండగకు రావాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే తటాలీవుడ్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ను కన్ఫర్మ్ చేసుకోవడమే కాకుండా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు.

ఇక కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తన సినిమా పరాశక్తిని జనవరి 14న రిలీజ్ చేయనున్నట్లు ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవి మోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తుండగా శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. జనవరి 14 అంటే నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి ఉన్నాయి. కుర్ర హీరోలతో పాటు కలిసిపోవచ్చు.. మంచి డేట్ నే ఎంచుకున్నాడు తమిళ్ హీరో అనుకున్నారు.

అయితే శివకార్తికేయన్ మాత్రం.. ఆ డేట్ ను వదిలి ముందుకు వచ్చాడు. జనవరి 14 న కాకుండా జనవరి 10 నే పరాశక్తి. రిలీజ్ కానుందని అధికారికంగా మేకర్స్ ప్రకటించారు. ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సూచనల మేరకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ తెలిపారు. సినిమా ముందుకు వస్తున్నందుకు హ్యాపీ అయినా.. కానీ, ఈ సినిమాకు ఒక్కరోజు ముందు ప్రభాస్ ది రాజాసాబ్ రిలీజ్ కానుంది. ఈ లెక్కన చూస్తే శివకార్తికేయన్, ప్రభాస్ మధ్య పోటీ గట్టిగా ఉండబోతుందని తెలుస్తోంది. డార్లింగ్ సినిమా వస్తుంది అంటే వాయిదా వేసుకోవాల్సింది పోయి.. ఢీకొట్టడానికే వస్తున్నాడు అంటే గెలవడానికేనా అని ప్రభాస్ ఫాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ప్రభాస్ తో పోటీ పడి శివకార్తికేయన్ గెలుస్తాడా.. ? లేదా అనేది చూడాలి.

Updated Date - Dec 22 , 2025 | 09:25 PM