STR: ఇప్పడన్నీ యాక్షన్ సినిమాలే.. హాస్యం చాలా తగ్గిపోయింది
ABN , Publish Date - May 08 , 2025 | 01:54 PM
ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో హాస్యం బాగా తగ్గిపోయిందని హీరో శింబు అలియాస్ శిలంబరసన్ టీఆర్ (SilambarasanTR) ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వస్తున్న చిత్రాల్లో హాస్యం బాగా తగ్గిపోయిందని హీరో శింబు అలియాస్ శిలంబరసన్ టీఆర్ (SilambarasanTR) ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నైలో ఇటీవల జరిగిన ఒక సినీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘ఒకరికి సాయం చేస్తుంటే ఎలాంటి ప్రతిఫలం ఆశించవద్దని, మనసులో ఏదో ఆశను దృష్టిలో పెట్టుకుని అసలు సాయం చేయొద్దని అన్నారు. మనం చేసే సాయం వల్ల వారు లబ్ది పొందితే వారిలో కొంతమంది కృతజ్ఞతగా ఉంటారని, మరికొందరు విస్మరిస్తారని అంత మాత్రానికి మనం వాటిని పట్టించుకోవాల్సినంత వసరం లేదన్నారు. సరిగ్గా అలాంటి వ్యక్తి, నటుడు సంతానం (Santhanam) అని అన్నారు.
ప్రస్తుతం మేమిద్దరం నా రాబోయే ‘ఎస్‌టీఆర్49’ (STR49)లో కలిసి నటిస్తున్నామని అన్నారు. ఇప్పుడు వస్తున్న చిత్రాల్లో హాస్యం చాలా తగ్గిపోయిందని, అధికంగా యాక్షన్ సినిమాలే వస్తున్నాయని అన్నారు. ఇటీవల రిలీజైన శశికుమార్ - సిమ్రాన్ నటించిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చూశానని. నాకు బాగా నచ్చిందని, అలాంటి సినిమాలు రావాలంటే సంతానం మళ్లీ కామెడీ పాత్రలు చేయాలని అన్నిరు. అందుకే ‘ఎస్‌టీఆర్49’లో తీసుకున్నాం. మున్ముందు సంతానాన్ని అనేక చిత్రాల్లో చూస్తారు’ అని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా శింభు, కమల్ హసన్తో కలిసి నటించిన థగ్ లైఫ్ మరో 20 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంగా ఓ తెలుగు చిత్రంలో మరోసారి పాట పాడారు. ఇక సంతానం విషయానికి వస్తే ఇప్పటికే డీడీ, డీడీ రిటర్న్స్ అంటూ హర్రర్ కామెడీ , చిత్రాలతో ఆకట్టుకున్న ఆయన మరోమారు డీడీ నెక్స్ట్ లెవల్ అనే హర్రర్ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.