3 BHK: తమ్ముడుతో సిద్ధార్థ్ పోటీ...
ABN , Publish Date - May 13 , 2025 | 02:50 PM
గత యేడాది 'ఇండియన్ -2', 'మిస్ యు' చిత్రాలతో నిరాశ పర్చాడు సిద్ధార్థ్. అతని తాజా చిత్రం '3 బిహెచ్ కె' రిలీజ్ డేట్ ను మేకర్స్ లాక్ చేశారు.
హీరో సిద్ధార్థ్ (Siddharth) ఈ మధ్య కమర్షియల్ మూవీస్ కంటే కంటెంట్ చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాడు. ఆ సినిమాలు సైతం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణకు నోచుకోవడం లేదు. గత యేడాది ఎస్. శంకర్ (S Shankar) దర్శకత్వంలో కమల్ హాసన్ (Kamal Haasan) 'ఇండియన్-2' (Indian -2) లో సిద్ధార్థ్ కీలక పాత్ర పోషించాడు. ఆ సినిమా ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఆ తర్వాత ఆషికా రంగనాథ్ తో కలిసి సిద్ధార్థ్ నటించిన 'మిస్ యూ' (Miss You) మూవీ వచ్చింది. ఇదీ కమర్షియల్ గా పే చేయలేదు.
ఈ యేడాది సిద్ధార్థ్... నయనతార, మాధవన్ తో కలిసి నటించిన 'టెస్ట్' (Test) మూవీ ఇటీవలే ఓటీటీలో విడుదలైంది. కానీ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేలానే 'టెస్ట్' ఉందనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి టైమ్ లో సిద్ధార్థ్ నటించిన కంటెంట్ బేస్డ్ మూవీ '3 బి.హెచ్.కె.' (3 BHK) రిలీజ్ కు రెడీ అయ్యింది. శరత్ కుమార్ (Sarath Kumar), దేవయాని (Devayani), 'గుడ్ నైట్' ఫేమ్ మీతా రంగనాథ్, చైత్ర జె అచార్, యోగి బాబు ఇందులో ఇతర కీలక పాత్రలు పోషించారు. శ్రీగణేశ్ దర్శకత్వంలో '3 బి.హెచ్.కె.' మూవీని అరుణ్ విశ్వ నిర్మించారు. అమ్రిత్ రామ్ నాథ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదల జులై 4న విడుదల కాబోతోంది. విశేషం ఏమంటే... అదే రోజును నితిన్ హీరోగా దిల్ రాజు నిర్మించిన 'తమ్ముడు' మూవీ సైతం జనం ముందుకు వస్తోంది. సో... 'తమ్ముడు'తో సిద్ధార్థ్ పోటీ పడుతున్నాడన్న మాట. మరి ఆ సమయానికి ఇంకా ఏయే సినిమాలు ఆ తేదీకి విడుదల అవుతాయో చూడాలి.
Also Read: Venkatesh, Sree Vishnu: క్రేజీ కాంబోలో సినిమా...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి