Siddharth - Raashii Khanna: సిద్ధార్థ్ జోడీగా.. రాశీ ఖన్నా! ఈ కాంబో.. అస‌లు ఊహించ‌లే

ABN , Publish Date - Nov 16 , 2025 | 06:59 PM

కోలీవుడ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ల‌వ‌ర్ బాయ్ సిద్ధార్థ్, రాశీ ఖన్నా జంటగా ఫ‌స్ట్ టైం ఓ సినిమా రూపొందుతుంది.

Siddharth - Raashii Khanna

కోలీవుడ్‌లో ఓ ఆస‌క్తిక‌ర‌మైన కాంబినేష‌న్ తెర‌మీద‌కు వ‌చ్చింది. ల‌వ‌ర్ బాయ్ సిద్ధార్థ్ (Siddharth), రాశీ ఖన్నా (Raashii Khanna) జంటగా ఫ‌స్ట్ టైం ఓ సినిమా రూపొందుతుంది. అంతేకాదు తొలిసారి నటించే చిత్రానికి 'రౌడీ అండ్ కో' (Rowdy&Co) అనే టైటిల్ ఖరారు చేశారు. సునీల్, యోగిబాబు (Yogi Babu), రెడిన్ కింగ్స్, ఫ్రాంక్ స్టార్ రాహుల్, వెట్రిమణి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

rowdy

గ‌తంలో సిద్దుతో ట‌క్క‌ర్ (Takkar) అనే డిఫ‌రెంట్ చిత్రం తెర‌కెక్కించిన‌ కార్తిక్ జి క్రిష్ (Karthik G Krish) దర్శకత్వం వ‌హిస్తుండ‌గా ఫ్యాషన్ స్టూడియోస్ (Passion Studios) పతాకంపై సుధన్ సుందరం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సిద్దు, రాశీ ఖ‌న్నా మొద‌టి సారి క‌లిసి న‌డుస్తుండ‌డంతో ఈ చిత్రంపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

sii.jpg

ఈ చిత్ర విశేషాలను దర్శకుడు వివరిస్తూ, 'ఇది రౌడీల కార్పొ రేట్ సామ్రాజ్యానికి సంబంధించిన స్టోరీ. అందుకే 'రౌడీ అండ్ కో' అనే టైటిల్ ఖరారు చేశాం. ఫుల్ లెంగ్త్ హాస్యభరితంగా తెరకెక్కిస్తున్నాం. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటుంది.

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేశాం. మరో 15-20 రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తాం. చెన్నైలో షూటింగ్ జరుపు కున్న ఈ చిత్రం అనేక సంక్లిష్ట సంఘటనలు, తద్వారా ఏర్పడే సమస్యలను ఎంతో ఫన్నీగా చిత్రీకరించాం' అని వివరించారు.

Updated Date - Nov 16 , 2025 | 07:52 PM