GDN: జీడీ నాయుడు’ చిత్రీకరణ పూర్తి
ABN , Publish Date - Dec 18 , 2025 | 09:14 AM
ఇండియన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (GDN) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న జీడీఎన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
ఇండియన్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గోపాలస్వామి దొరైస్వామి నాయుడు (GDN) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న జీడీఎన్’ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఇస్రో శాస్త్రవేత నంబి నారాయణన్ (Nambi Narayanan) పాత్రకు ప్రాణం పోసిన మాధవన్ ఇప్పుడు 'ఎడిసన్ ఆఫ్ ఇండియా' (Edison of India) గా చెప్పుకుని గోపాలస్వామి దొరైస్వామి నాయుడు ఉరఫ్ జీడీ నాయుడు (GD Naidu) పాత్రను చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ అదిరింది. జీడీ నాయుడుగా మేకోవర్ కావడం కోసం మాధవన్ ఎంత కృషి చేశాడో ఇటీవల విడుదల చేసిన గ్లిమ్స్ చూస్తే అర్థమైంది.
ఈ బయోపిక్ ను కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వంలో వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి విజయ్ మూలన్, వర్గీస్ మూలన్, ఆర్.మాధవన్, సరితా మాధవన్ నిర్మాతలు. సత్యరాజ్, జయరాం, దుషార విజయన్, తంబి రామయ్య, వినయ్ రాయ్, మీరా జాస్మిన్ తదితరులు నటించారు. ఈ మూవీ చిత్రీకరణ పనులన్నీ పూర్తయ్యాయని, వచ్చే యేడాదిలో విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇందులో మాధవన్ లుక్ చూసి గణేశ్' సినిమాలో కోట శ్రీనివాసరావు గెటప్ ను తలపించేలా ఉందని, మాధవన్ అంటే నమ్మశక్యంగా లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.