Soothravakyam: హీరోగా షైన్ టామ్ చాకో.. తెలుగు ట్రైలర్ చూశారా
ABN , Publish Date - Jul 20 , 2025 | 03:34 PM
మలయాళ విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో హీరోగా రూపొంది ఇటీవల థియేటర్లలోకి వచ్చిన చిత్రం సూత్రవాక్యం
మలయాళ విలక్షణ నటుడు షైన్ టామ్ చాకో (Shine Tom Chacko) హీరోగా మలయాళ నాట రూపొందిన ఇటీవల థియేటర్లలోకి వచ్చిన చిత్రం సూత్రవాక్యం (Soothravakyam). విన్సీ ఆలోషియస్ (Vinci Aloysius), దీపక్ పరంబోర్ (Deepak Parambol), మీనాక్షి మాధవి, దివ్య ఎం. నాయర్ ప్రధాన పాత్రలు పోషించారు. యూజియాన్ జాస్ చిరమ్మల్ ను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రాన్ని సినిమా బండి ప్రొడక్షన్స్ పతాకంపై కాండ్రేగుల లావణ్యాదేవి సమర్పణలో కాండ్రేగుల శ్రీకాంత్ ఈ సినిమాను తెలుగులోకి తీసుకు వస్తున్నారు.
జూలై25న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. కోవిడ్ సమయంలో.. కేరళలోని విదుర పోలీస్ స్టేషన్‌లో యువతలో ధైర్యాన్ని నింపి, వారి కలలు, ఆశయాలు పునరుత్తేజం అయ్యేందుకు చేపట్టిన కౌన్సిలింగ్ కార్యక్రమాల స్పూర్తితో, భారతీయ సినిమాను సరికొత్త పుంతలు తొక్కించే ఈ వినూత్న కథతో ఈ 'సూత్రవాక్యం' తెరకెక్కడం గమనార్హం. తెలుగు నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం.