Shine Tom Chacko: దయచేసి ఆస్పత్రికి తీసుకువెళ్లండి అని ఏడ్చేశాను

ABN , Publish Date - Jun 29 , 2025 | 08:33 PM

షైన్‌ టామ్‌ చాకో కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగడంతో ఆయన తండ్రి సీపీ చాకో మృతి చెందారు. ఈ విషాదాన్ని ఉద్దేశించి తాజాగా యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

‘దసరా’ (Dasara) చిత్రంలో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న షైన్‌ టామ్‌ చాకో (Shine Tom Chacko) ఇంట ఇటీవల విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే! ఆయన కుటుంబం ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరగడంతోఆయన తండ్రి సీపీ చాకో మృతి చెందారు. ఈ విషాదాన్ని ఉద్దేశించి తాజాగా యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనిపై షైన్‌ టామ్‌ చాకో స్పందించారు.  

 
‘‘ఆరోజు అమ్మానాన్న, నేను, నా సోదరుడు కారులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదం జరిగింది. నేను వెనుక సీటులో కూర్చొని నిద్రపోతున్నా. మధ్యలో మెళకువ రావడంతో నాన్నతో మాట్లాడుతూ మళ్లీ పడుకున్నా. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచా. చూస్తే మా కారుకు ప్రమాదం జరిగింది. నాకు ఏమీ అర్థం కాలేదు. మేమంతా రోడ్డు మీద ఉన్నామనే విషయం కూడా అర్థం కాలేదు. అమ్మ షాక్‌కు గురయ్యారు. ‘మనం ఎందుకు రోడ్డు మీద ఉన్నాం. ఎక్కడికి వెళ్తున్నాం’ అని ప్రశ్నించారు. మా నాన్నను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. రోడ్డు ప్రమాదాల గురించి ఎన్నో సార్లు విన్నాం. తొలిసారి ఇలాంటి ఘటన ఎదుర్కొన్నా. ‘దయచేసి ఎవరైనా సాయం చేయండి. మమ్మల్ని ఆస్పత్రికి తీసుకువెళ్లండి’ అంటూ ఏడ్చేశాను’’ అని షైన్‌ టామ్‌ చాకో తెలిపారు. అసలు ఈ యాక్సిడెంట్‌ ఎలా జరిగిందనేది గుర్తు రాలేదన్నారు. ుూఆరోగ్య పరమైన కారణాల వల్ల నేను కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నాను. దానివల్ల ఎక్కువ సేపు నిద్రలో ఉంటున్నానని చెప్పారు. ప్రమాదం జరిగిన రోజు కూడా ఆ మందులు తీసుకున్నాను.  అందుకే ఏం జరిగిందో తెలియదు. ఈ ప్రమాదంలో విపరీతంగా గాయాలయ్యాయి. సుమారు 30 కుట్లు పడ్డాయి. అమ్మకి, బ్రదర్‌కి స్పల్పంగా గాయాలయ్యాయి. తండ్రి మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం’’ అని అన్నారు.

Updated Date - Jun 29 , 2025 | 08:37 PM