Balti: తెలుగులోనూ థియేటర్లకు.. షేన్ నిగమ్ లేటెస్ట్ హిట్ 'బల్టీ'
ABN , Publish Date - Oct 06 , 2025 | 09:38 AM
ఇటీవల మలయాళ చిత్రాలు తెలుగులోనూ అనువాదం అవుతూ రిలీజ్ అయి మంచి విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల మలయాళ చిత్రాలు తెలుగులోనూ అనువాదం అవుతూ రిలీజ్ అయి మంచి విజయం సాధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పటికే కేరళలో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న బల్టీ (Balti) సినిమా తెలుగులో థియటర్లకు వచ్చేందుకు సిద్దమైంది. మలయాళ వర్దమాన నటుడు ఇప్పుడిప్పుడే స్టార్ కేటగిరీలోకి రాబోతున్న షేన్ నిగమ్ (Shane Nigam) ఈ సినిమా హీరో. ఇది ఆయనకు 25వ చిత్రం. కబడ్డీ, లోకల్ పాలిటిక్స్ నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు.
గత చిత్రం మద్రాస్ కారన్‌తో మెగా డాటర్ నిహారికాతో రోమాన్స్ చేసిన హీరో ఈ సారి మరో తెలుగమ్మాయి ప్రీతి ఆశ్రానితో (Preethi Asrani) స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. తమిళ దర్శక నటుడు సెల్వరాఘన్ (Selvaraghavan ), శంతను భాగ్యరాజ్ (Shanthnu),ఆల్పోన్స్ పుత్రన్ (Alphonse Puthran) కీలక పాత్రలు చేశారు. ఉన్ని శివలింగం (Unni Sivalingam) దర్శకుడిగా ఈ సినిమాతో ఆరంగేట్రం చేశాడు. అంతేకాదు లేటెస్ట్ మ్యూజిక్ సెన్షేషన్ సాయి అభయంకర్ (Sai Abhyankkar)ఈ సినిమాతోనే మ్యూజిక్ డైరెక్టర్‌గా మారడం గమనార్హం. ఇదిలాఉంటే ఆక్టోబర్10న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది.
తమిళనాడు మరియు కేరళ సరిహద్దులో ఉన్న వెలంపాళయంలో జరిగే ఔట్ అండ్ ఔట్ రా రస్టిక్ విలేజ్ డ్రామాగా సినిమా ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఆ ఊరిని శాసించే ముగ్గురు పెద్దలు వారి మధ్య జరిగే వ్యాపార రాజకీయాల్లో నలుగురు కబడ్డీ ప్లేయర్స్ చిక్కుకోవడం, ఆపై వచ్చే ఘర్షణలు, భావోద్వేగాల సమాహారంగా బల్టీ (Balti) సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది.