Sathamindri Mutham Tha: నిశ్శబ్ద ప్రేమతో శ్రీరామ్...

ABN , Publish Date - May 19 , 2025 | 04:32 PM

తెలుగు వాడైన శ్రీరామ్ తమిళ చిత్రసీమలో రాణిస్తున్నాడు. అడపాదడపా స్ట్రయిట్ తెలుగు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అతని తమిళ చిత్రం ఒకటి 'నిశ్శబ్ద ప్రేమ' పేరుతో ఈ నెల 23న జనం ముందుకు రాబోతోంది.

ప్రముఖ తమిళ కథానాయకుడు శ్రీరామ్ (Sriram) పలు స్ట్రయిట్ తెలుగు సినిమాల్లోనూ చేస్తున్నాడు. అతని తాజా చిత్రం 'ఎర్రచీర' (Erracheera) విడుదల కావాల్సి ఉంది. అయితే... అతను నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో డబ్ అవుతోంది. గత యేడాది మార్చి 1న శ్రీరామ్ నటించిన 'శతమిండ్రి ముత్తం దా' (Sathamindri Mutham Tha) చిత్రం విడుదలైంది. ఈ మర్డర్ మిస్టరీ మూవీలో ప్రియాంక తిమ్మిష్, హరీశ్‌ పేరడి (Hareesh Peradi), ఆనంద్ రాజ్, వియాన్ మంగళసెర్రీ, నిహారిక పాత్రో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాతో రాజ్ దేవ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

తన భార్య సంధ్యతో కలిసి హాయిగా జీవితాన్ని సాగిస్తుంటాడు విఘ్నేష్. అయితే ఓ రోజు అతని భార్య హత్యకు గురవుతుంది. ఎవరు ఆమెను చంపారో అర్థం కాదు. ఈ కేసును సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎడ్వర్డ్ టేకప్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ మిన్నల్ మురుగన్ కొడుకు రఘు ఆమెను హత్యచేశాడనే విషయం విచారణలో తెలుస్తుంది. రఘు ఈ హత్య ఎందుకు చేశారు? దీని వెనుక ఉన్న మోటో ఏమిటీ? అనేది మిగతా కథ. తమిళనాట ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. అయితే... ఇప్పుడీ సినిమాను తెలుగులో 'నిశ్శబ్ద ప్రేమ' (Nissabha Prema) పేరుతో డబ్ చేసి ఈ నెల 23న విడుదల చేయబోతున్నారు.


ఈ వారం నాలుగు అనువాద చిత్రాలు!

రాబోయే శుక్రవారం ఐదు చిత్రాలు జనం ముందుకు రాబోతున్నాయి. అయితే అందులో నాలుగు డబ్బింగ్ మూవీస్ కావడం విశేషం. ఈ ఫ్రైడే స్ట్రయిట్ తెలుగు సినిమా 'వైభవం' ఒక్కటే రాబోతోంది. అదే రోజున అక్షయ్ కుమార్ నటించిన హిందీ అనువాద చిత్రం 'కేసరి: చాప్టర్ 2', విజయ్ సేతుపతి 'ఏస్', శ్రీరామ్ నటించిన 'నిశ్శబ్ద ప్రేమ', డిస్నీ సంస్థ నిర్మించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా 'లిలో అండ్ స్టిచ్' చిత్రాలు రాబోతున్నాయి. లాస్ట్ వీకెండ్ లో సైతం మొత్తం ఐదు సినిమాలు విడుదలైతే స్ట్రయిట్ తెలుగు సినిమాలు రెండే కాగా మూడు డబ్బింగ్ సినిమాలు వచ్చాయి.

Also Read: Vishal - Dhansika: తప్పకుండా ప్రేమ వివాహమే.. క్లారిటీ ఇచ్చిన హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 19 , 2025 | 04:34 PM