Devil's Double Next Level: డబుల్ డోస్.. హర్రర్, ఫన్‌తో తెలుగులోనూ వస్తున్న సంతానం
ABN , Publish Date - May 11 , 2025 | 06:56 PM
వరుస విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోతున్న హీరో సంతానం. గత సంవత్సరం డీడీ భూతాల బంగ్లా అంటూ ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ యేడు కూడా అదే సిరీస్‌లో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.
తమిళ నాట వరుస విజయవంతమైన చిత్రాలతో దూసుకుపోతున్న హీరో సంతానం (Santhanam). గత సంవత్సరం డీడీ భూతాల బంగ్లా అంటూ ప్రేక్షకులను అలరించిన ఆయన ఈ యేడు కూడా అదే సిరీస్‌లో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ (Devil's Double Next Level) అంటూ తెరకెక్కిన ఈ చిత్రం ఈ వారం మే 16న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకు ముస్తాబయింది. ఈ మేరకు తాజాగా తెలుగు ట్రైలర్‌ను విడుదల చేయగా మంచి ఆదరణను పొందుతుంది.
అయితే ఈ సారి గత రెండు చిత్రాలను మించి ఫన్, హర్రర్ ఉండనున్నట్లు తాజా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. గీతిక (Geethika) కథానాయికగా నటించగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon), సెల్వ రాఘవన్ (Selvaraghavan), మొట్ట రాజేంద్రన్ (Motta Rajendran), రెడ్ కింగ్ స్లే (Redin Kingsley) కీలక పాత్రల్లో నటించారు. ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహించాడు. నిహారికా ఎంటర్‌టైన్‌మెంట్ (Niharika Entertainment) తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.
సినిమాలకు రివ్యూలు ఇచ్చే హీరోను ఓ దయ్యం పగబట్టి డైరెక్ట్ ఓ సినిమాలోకి ప్రవేశబెట్టి రివ్యూ ఇవ్వాలని ఆదేశించడం, ఐలాండ్‌లో హీరో పడే ఇబ్బందులు చుట్టూ సినిమా సాగనుంది. ఈ సిరీస్‌లో గతంలో వచ్చిన రెండు చిత్రాలు తెలుగు నాట కూడా మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకోగా ఓటీటీలో సైతం చిన్న పిల్లలు తెగ ఎంజాయ్ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్ (Devil's Double Next Level) సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.