Santhanam: 'గోవిందా గోవిందా'.. వివాదంలో సంతానం సినిమా..
ABN , Publish Date - May 13 , 2025 | 06:50 PM
తమిళ నటుడు సంతానం (Santhanam) నటించిన ‘డీడీనెక్ట్స్ లెవల్’ (DD next level) సినిమాలోని కిస్సా 47 (kissa 47) పాట వివాదాస్పదంగా మారింది.
తమిళ నటుడు సంతానం (Santhanam) నటించిన ‘డీడీనెక్ట్స్ లెవల్’ (DD next level) సినిమాలోని కిస్సా 47 (kissa 47) పాట వివాదాస్పదంగా మారింది. ఈ పాటలో ఉపయోగించిన ‘గోవింద గోవింద’ పదాలు తిరుమల శ్రీవారిని కించపరిచేలా ఉన్నాయని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కెలుతి సాహిత్యంతో రూపొందిన ఈ పాటకు ఇప్పటికే 92 లక్షల వ్యూస్ సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై తమిళనాడు బీజేపీ లీగల్ సెల్, సేలం పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. పాటను వెంటనే తొలగించకపోతే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 16న రిలీజ్‌కు సిద్థమవుతున్న ఈ సినిమాకు వివాదం ఊహించని షాక్‌గా మారింది.
20 ఏళ్లుగా ఇండస్ర్టీలో ఉన్న సంతానం స్టార్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత హీరోగా టర్న్ అయి పలు చిత్రాల్లో నటించాడు. తెలుగులో సునీల్ నటించిన ‘మర్యాద రామన్న’ని తమిళ్‌లో రీమేక్ చేసి హిట్టు కొట్టాడు. క్రమంగా హారర్ కామెడీ బాట పట్టిన సంతానం.. డిల్ల్లుకు దుడ్డు’, ‘డిల్లుకు దుడ్డు 2’ ‘డీడీ రిటర్న్’ వంటి సినిమాలతో హిట్టు కొట్టాడు. తాజాగా అదే సిరీస్‌లో ‘డెవిల్స్ డబుల్ నెక్ట్స్ లెవల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఎస్.ప్రేమ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తుండగా.. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సెల్వరాఘవన్, గీతికా తివారీ, యషికా ఆనంద్, కస్తూరి శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ ట్రైలర్‌కు మంచి స్పందన దక్కింది.