Sundeep Kishan: జెన్ జడ్ విజిలెంట్ యాక్షనర్.. 'సిగ్మా' టీజర్ వచ్చేసింది

ABN , Publish Date - Dec 23 , 2025 | 10:36 PM

సందీప్ కిషన్ హీరోగా విజయ్ తనయుడు జాసన సంజయ్ తెరకెక్కిస్తున్న సినిమా 'సిగ్మా'. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా టీజర్ విడుదలైంది.

Sigma Movie

సుభాస్కరన్ లైకా ప్రొడక్షన్స్ నుండి మరో ప్రతిష్టాత్మక వెంచర్‌ గా 'సిగ్మా' (Sigma) రాబోతోంది. ఈ సినిమాతో కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ (Jason Sanjay) దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. సందీప్ కిషన్ (Sundeep Kishan) హీరో నటిస్తున్న ఈ చిత్రం యాక్షన్, అడ్వెంచర్ కామెడీ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభించింది. దాంతో తాజాగా మేకర్స్ టీజర్‌ రిలీజ్ చేశారు.

'మంచోడు.. మహానుభావుడు, చెడ్డోడు... రాక్షసుడు.. చూసే నీ చూపుని బట్టి, ఇప్పుడు ఈ క్షణం నన్ను నేను కాపాడుకోవడానికి ఎలాగైనా మారుతాను' అనే హీరో పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ప్రారంభమయింది. ఈ లైన్ వెంటనే కనెక్ట్ అవుతూ విజిలెంట్ కథని సూచిస్తుంది. దర్శకుడిగా జేసన్ సంజయ్ తొలి అడుగే బలమైన స్టేట్‌మెంట్‌లా కనిపిస్తోంది. స్టైలిష్‌గా, హై-ఆక్టేన్ కట్స్‌తో రూపొందిన ఈ టీజర్‌లో అతని కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్. తమన్ అందించిన దుమ్మురేపే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ఎనర్జీ, ఇంటెన్సిటీని మరింత పెంచింది. డైలాగ్స్, విజువల్స్ చూస్తే 'సిగ్మా' పూర్తిగా విజిలెంట్ హీరో జానర్‌ తో ఆకట్టుకుంది. ఇందులో జెన్-జీ టచ్‌ స్పష్టంగా కనిపించింది.


విజువల్‌గానూ 'సిగ్మా' టీజర్ చాలా రిచ్‌గా, క్లాసీగా ఉంది. సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ కెమెరా వర్క్ ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తూ, సినిమాకు గ్రాండ్ సినీమాటిక్ ఫీల్ ఇచ్చింది. లైకా ప్రొడక్షన్స్ మరోసారి తమ హై ప్రొడక్షన్ వాల్యూస్‌తో సినిమాను పెద్ద స్థాయిలో దీన్ని ప్రెజెంట్ చేసింది. సందీప్ కిషన్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో టీజర్‌ లో అదరగొట్టాడు. యాక్షన్, ఇంటెన్సిటీ, ఎనర్జీ... ఈ మూడు అంశాల్లోనూ అతని స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుంది. ఇంతకుముందెన్నడూ చూడని హై-ఇంపాక్ట్ యాక్షన్ అవతార్‌లో సందీప్ కిషన్ రా అగ్రెషన్‌కి స్టైలిష్ స్వాగ్‌ ని అద్భుతంగా క్యారీ చేశాడు.

కథనం ఒక ట్రెజర్ హంట్ చుట్టూ తిరుగుతుందని టీజర్ బట్టి తెలుస్తోంది. సందీప్ కిషన్‌కు జోడీగా ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) నటిస్తుండగా రాజు సుందరం (Raju Sundaram), అన్బు థాసన్, యోగ్ జాపీ, సంపత్ రాజ్, కిరణ్ కొండ, మహాలక్ష్మి సుదర్శనన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కేథరిన్ (Catherine Tresa) ఒక హై-ఎనర్జీ స్పెషల్ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మల్టీలింగ్వల్ చిత్రంగా రూపొందుతున్న 'సిగ్మా' 2026 సమ్మర్‌లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Updated Date - Dec 23 , 2025 | 10:41 PM