Sai Pallavi: కలైమామణి అవార్డు.. అందుకున్న సాయిపల్లవి

ABN , Publish Date - Oct 12 , 2025 | 08:18 AM

శనివారం సాయంత్రం చెన్నైలో సీఎం స్టాలిన్ చేతుల మీదుగా త‌మిళ‌నాడు ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలు సినీ, రంగ స్థల కళాకారులు అందుకున్నారు.

Sai Pallavi

చెన్నై చేపాక్ కలైవానర్ అరంగంలో శనివారం సాయంత్రం జరిగిన వేడుకల్లో సీఎం స్టాలిన్ (MK Stalin) చేతుల మీదుగా రాష్ట్రప్రభుత్వం ఎంపిక చేసిన సినీ, రంగ స్థల కళాకారులు ప్రతిష్టాత్మకమైన కలైమామణి పురస్కారాలు (Kalaimamani Awards) అందుకున్నారు.

Sai Pallavi

వీరిలో ప్రముఖ సినీ నటి సాయిపల్లవి (Sai Pallavi), నటులు ఎస్తో సూర్య, విక్రమ్ ప్రభు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh), దర్శకుడు లింగుస్వామి తదితరులున్నారు. ఎంఎస్‌ సుబ్బలక్ష్మి పురస్కారాన్ని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు కేజే యేసుదాస్ దక్కించుకున్నారు.

Sai Pallavi

ఈ కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ... అత్యుత్తమ కళాకారులకు పురస్కారాలు ప్రదానం చేసి ప్రశం సించే అవకాశం తనకు దక్కడం ఆనందంగా ఉందన్నారు. 2021 2022, 2023 సంవత్సరాలకు గాను రాష్ట్రప్రభుత్వ కలైమామణి పురస్కారాలకు ఎంపికైన కళాకారులలో ఆర్థికంగా వెనుకబడిన వారికి రూ. లక్ష ప్రోత్సాహక నగదుతో పాటు ప్రతినెలా రూ.3వేలు ఆర్థిక సాయం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

Sai Pallavi

రాకెట్ వేగంతో పోటీపడేలా ఒకేరోజు రెండుసార్లు బంగారం ధర పెరిగిందని, బంగారు పతకం కంటే కలైమామణి పురస్కారం కళాకారు లకు సమాజంలో మరింత గుర్తింపు, గౌరవం చేకూ ర్చుతుందని సీఎం పేర్కొన్నారు.

Updated Date - Oct 12 , 2025 | 08:30 AM