Robo Shankar: ప్రముఖ హాస్య నటుడు క‌న్నుమూత‌.. విషాదంలో ఇండ‌స్ట్రీ

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:09 AM

త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ (46) గురువారం రాత్రి కన్నుమూశారు.

Robo Shankar

త‌మిళ సినిమా ఇండ‌స్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ హాస్య నటుడు రోబో శంకర్ (46) (Robo Shankar)గురువారం రాత్రి 830 గంటల సమయంలో కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం కారణంగా పెరుంగుడిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన గురువారం మరణించినట్టు వైద్యులు ప్రకటించా రు. శంకర్‌కు భార్య ప్రియాంక, కుమార్తె ఇంద్రజ ఉన్నారు.

భార్య బుల్లితెర నటి కాగా, కుమార్తె ఇంద్రజ అగ్ర నటుడు విజయ్ నటించిన 'బిగిల్' చిత్రంలో పాండియమ్మ అనే పాత్రలో ఫుట్ బాల్ క్రీడాకారిణిగా మెప్పించారు. రోబో శంకర్ భౌతికకాయాన్ని వలసరవాక్కం, శ్రీదేవికుప్పలలో ఉన్న ఆయన స్వగృహానికి తరలించి, సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శ నార్థం ఉంచారు. విజయ్ టీవీలో ప్రసారమైన కలక్క పోవదు యార్' అనే షో ద్వారా రోబో శంకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అద్భుతమైన మిమిక్రీతో బుల్లితెర ప్రేక్షకుల మనస్సుల్లో చెర గని ముద్ర వేసుకున్నారు. ఆయన చుట్టి అరవింద్ కలిసి ప్రద ర్శించిన అనేక కామెడీ షోలు విశేష ప్రజాధారణ పొందాయి.

Robo Shankar.jfif

అలాగే, వేదికలపై రోబో తరహాలో నృత్యం చేయడంతో ఆయన పేరు రోబో శంకర్‌గా స్థిర పడిపోయింది. స్టేజ్ షోలు చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. విజయ్ సేతుపతి నటించిన 'ఇదర్కు దానే అసైపట్టాయ్ బాలకుమార అనే చిత్రంలో పూర్తి స్థాయి పాత్రలో నటించి శెభాష్ అనిపించుకు న్నారు. ఆ తర్వాత 'కప్పల్', 'మారి', 'వాయై మూడి 'పేనపుమ్' వంటి అనేక చిత్రాల్లో నటించారు. కొంత కాలం క్రితం ఆయనకు కామెర్ల వ్యాధి సోకింది. దీంతో గణనీయంగా బరువు తగ్గారు.

కోలుకున్న తరువాత తిరిగి సినిమాల్లో నటించారు. ఇటీవల మళ్ళీ అనారోగ్యా నికి గురికావడంతో పెరుంగుడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 19 , 2025 | 07:00 AM