Darshan: హత్య చేసినా మా హీరోనే.. పిచ్చి అంటారు సార్ దీన్ని
ABN , Publish Date - Dec 10 , 2025 | 08:36 PM
అభిమానం .. ఈ పేరుకు వేరే ఏ అర్దాలు ఉండవు. ఒక హీరోను ప్రేక్షకులు ఇష్టపడ్డారు అంటే.. వారు చనిపోయేవరకు ఆ అభిమానంతోనే ఉంటారు.
Darshan: అభిమానం .. ఈ పేరుకు వేరే ఏ అర్దాలు ఉండవు. ఒక హీరోను ప్రేక్షకులు ఇష్టపడ్డారు అంటే.. వారు చనిపోయేవరకు ఆ అభిమానంతోనే ఉంటారు. దాన్ని ఎవరూ మార్చలేరు. అయితే ఇలాంటి అభిమానం తెలుగు అభిమానులకు మాత్రమే సొంతం. కానీ, తెలుగు అభిమానులు ఏది మంచి.. ఏది చేడు అని ఆలోచిస్తారు. అభిమాన హీరో తప్పు చేస్తే.. అది తప్పే అని నిలదీస్తారు. మంచి చేస్తే నలుగురికి చెప్పుకొని మా హీరో అని గొప్పగా చెప్తారు. కానీ, కన్నడ ఫ్యాన్స్ మాత్రం మితిమీరిన అభిమానాన్ని చూపిస్తున్నారు అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక హత్య చేసి జైలుకు వెళ్లిన హీరో నటించిన సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ హీరో ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan)
కన్నడ చిత్ర పరిశ్రమలో ఛాలెంజింగ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న హీరో దర్శన్ ప్రస్తుతం దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. తన వీరాభిమాని రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన జైలు జీవితం గడుపుతున్నాడు. ఈ కేసులో సాక్ష్యాల తారుమారు, కట్టుదిట్టమైన విచారణ కారణంగా బెయిల్ దొరకడం అనేది అత్యంత కష్టంగా మారింది. అయితే, కేసు విచారణ దశలో ఉండగా, గతంలో ఒకానొక సందర్భంలో షరతులతో కూడిన బెయిల్ లభించింది. ఆ కొద్ది రోజుల వ్యవధిలోనే దర్శన్ తన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం డెవిల్ షూటింగ్‌ను చకచకా పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది.
దర్శన్ జైలులో ఉన్నప్పటికీ, ఆయన సినిమా డెవిల్ విడుదల కోసం కన్నడ ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూశారు. ఎట్టకేలకు, డిసెంబర్ 11న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమైంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, దర్శక నిర్మాతలు ఈ సినిమాకు ఓ రేంజ్‌లో పబ్లిసిటీ చేశారు. దర్శన్ జైల్లో ఉండటం, సినిమా ప్రమోషన్లకు అందుబాటులో లేకపోవడం వంటి అంశాలను కూడా సెంటిమెంట్‌గా మార్చి, సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రచారానికి తగ్గట్టుగానే, దర్శన్ అభిమానులు ఊహించని విధంగా స్పందించారు. హత్య కేసు లాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా, తమ హీరోపై ఉన్న వెర్రి అభిమానాన్ని చాటుకుంటూ రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ చేస్తున్నారు. తొలి రోజు, తొలి షో టికెట్ల కోసం థియేటర్ల వద్ద క్యూ కడుతున్నారు.
దర్శన్ అభిమానుల గురించే సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఎలా ఒక హత్య చేసిన క్రిమినల్ ని వీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. దర్శన్ ఒక మనిషిని చంపాడు. జైల్లో ఉన్నాడు. అది చిన్న విషయం కాదు. అవేమి పట్టించుకోకుండా ఫ్యాన్స్.. తమ హీరోను తెరపై చూసేందుకు, ఆయనపై తమ అభిమానాన్ని చాటుకునేందుకు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నారు. ఈ పిచ్చి అభిమానం చూస్తే, దర్శన్ ఏ పిటి కేసులోనో అరెస్ట్ అయ్యాడు అనేంత తేలిగ్గా వారు ఈ విషయాన్ని తీసుకుంటున్నారా అనిపిస్తుంది. ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. ఇదెక్కడి అభిమానం రా బాబు. అసలు దీన్ని అభిమానం అనరు .. పిచ్చి అంటారు అని, ఈ లెక్కన.. హత్యలు చేసి జైలుకు వెళ్లి వచ్చినా తమ అభిమానులు ఫీల్ అవ్వరు.. మా స్టేటస్ ఎక్కడికి పోదు. బెయిల్ పై బయటకు వచ్చి, సినిమాలు చేసుకొని పోతే సరిపోతుందని హీరోలు అనుకుంటారేమో అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.