KGF 3: కేజీఎఫ్ చాప్టర్-3కి సిద్ధం.. ఇన్‌స్టాలో ప్రశాంత్ నీల్ పోస్ట్! నిజమేనా?
ABN , Publish Date - Oct 16 , 2025 | 08:33 AM
‘కేజీఎఫ్’ రెండు చాప్టర్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడ చిత్రసీమ రూపు రేఖల్ని మార్చేశాయి.
‘కేజీఎఫ్’ రెండు చాప్టర్లు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కన్నడ చిత్రసీమ రూపు రేఖల్ని మార్చేశాయి. రాకింగ్ స్టార్ యశ్ (Yash) ను పాన్ ఇండియా నటుడిగా యశ్‌ని మార్చేశాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా అయిపోయాడు. కేజీఎఫ్-2 సినిమా 2022, ఏప్రిల్ 14న విడుదలైంది. ఈ సినిమా జాతీయ, అంతర్జాతీయస్థాయిలో రికార్థులు సృష్టించింది. చాప్టర్ 3 (KGF Chapter3) ఉంటుందని అదే సినిమాలో చిన్న సంకేతం సైతం ఇచ్చారు.
అందుకు తగ్గట్టుగానే ‘కేజీఎఫ్ చాప్టర్ 3’ కూడా రాబోతోందని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. యశ్, ప్రశాంత్ నీల్ కూడా కేజీఎఫ్ కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. చిత్ర నిర్మాణ సంస్థ మూడేండ్ల క్రితం హోంబలే ఫిల్మ్స్ ఓ వీడియో సైతం విడుదల చేసింది.
‘‘1978 నుంచి 81 వరకూ రాఖీ భాయ్ ఎక్కడ ఉన్నాడు’’ అంటూ ఓ కొత్త ప్రశ్న లేవనెత్తింది. ఈ వీడియో అప్పటంలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంటే.. ఆ మూడేళ్ల కాలంలో రాఖీ భాయ్ ఏం చేశాడన్న నేపథ్యంలో మూడో భాగం వచ్చే అవకాశం ఉందన్న హింట్.. చిత్ర బృందం పరోక్షంగా ఇవ్వడంతో ‘చాప్టర్ 3’ ఉంటుందన్న ఊహాగానాలకు బలం చేకూరినట్టైంది. కానీ మరలా ఇన్నేండ్లు దాని ఊసే లేదు.
అయితే.. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్, కేజీఎఫ్ చాప్టర్-3కి కూడా సిద్ధమయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను బుధవారం ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది. కేజీఎఫ్ చాప్టర్-3కి సంబంధించి ఫైనల్ డ్రాఫ్ట్ సిద్ధమైనట్లు ప్రశాంత్ నీల్ పోస్టును బట్టి అర్థమౌతోంది.
కేజీఎఫ్-3కి సంబంధించి మరికొన్ని నెలలోనే అప్డేట్స్ ఇస్తామని హౌంబాలే ఫిలిమ్స్ ముఖ్యులు విజయ్ కిరంగదూర్ ఏడాది క్రితం ప్రకటించారు. ఆ తరువాత ఎలాంటి ప్రకటనా రాలేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్, నిర్మాత విజయ్ కిరగందూరు, నటుడు యశ్.. వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు.
ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్‌లో బిజీగా ఉండగా దాని అనంతరం ప్రభాస్‌తో‘సలార్ 2’ (Salaar Part2) రూపొందించిన తర్వాతే చాప్టర్ 3 సెట్స్‌పైకి వెళ్లొచ్చు. సుమారు 2027 తర్వాతే ఈ సినిమా షూటింగ్‌కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2028 డిసెంబర్28న ప్రేక్షకుల ఎదుటకు రానున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
ఇదిలాఉంటే ఇన్‌స్టాలో ప్రశాంత్ నీల్ నిజంగా కేజీఎఫ్ 3 గురించి ఫోస్ట్ చేశాడా లేక పేరడీ అకౌంట్‌తో మరెవరైనా చేశారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎక్కడా అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో ఇదంతా ఫేక్ న్యూస్ అనే చర్చ కూడా నడుస్తోంది. సేమ్ నీల్ ఫొటో, పేరుతో అచ్చం అలాంటి అకౌంట్ క్రియేట్ చేసి ఒరిజినల్ అనేలా కేజీఎఫ్ 3 పోస్టులు చేస్తుండడంతో అంతా నిజమనుకుని వాటిని వైరల్ చేస్తున్నారు.