Bro Code: రవి మోహన్ బ్రో కోడ్.. తెలుగు ప్రోమో అదిరింది
ABN , Publish Date - Aug 28 , 2025 | 07:50 PM
ఇటీవలే రవి మోహన్ స్టూడియోస్(Ravi Mohan Studios) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (Ravi Mohan) ఇటీవలే రవి మోహన్ స్టూడియోస్(Ravi Mohan Studios) పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంట్లో భాగంగా ఇప్పటికే రెండు చిత్రాలను ప్రకటించిన ఆయన ఓ సినిమాలో హీరోగా నటిస్తుండగా, మరో సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇందులో యోగిబాబ హీరోగా నటించనున్నాడు. ఇక. తను హీరోగా రూపొందుతున్న సినిమాకు గతంలో డిక్కిలోనా, వడకుపట్టి రామస్వామి లాంటి కామెడీ సినిమాలు తెరకెక్కించిన కార్తీక్ యోగి (Karthik Yogi) దర్వకత్వం వహిస్తున్నాడు. స్లాప్ స్టిక్ కామెడీ బేస్డ్ జానర్‌లో ఈ సినిమా ఉండనుంది. హర్షవర్దన్ రామేశ్వర్ (Harshavardhan Rameshwar) సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా బుధవారం) వినాయక చవితిని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన తమిళ ప్రోమోను విడుదల చేసిన మేకర్స్ గురువారం తెలుగు ప్రోమోను సైతం రిలీజ్ చేశారు. ఈ సినిమాలో జయం రవి సరసన తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ (Gouri Priya) నటిస్తోండగా ఎస్జే సూర్య ( SJ Suriyah), శ్రద్ద శ్రీనాధ్ (Shraddha Srinath), అర్జున్ అశోకన్ (Arjun Ashokan), మాళవిక మనోజ్ (Malavika Manoj)లు రెండు జంటలుగా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వీరితో పాటు ఉపేంద్ర (Upendra), ఐశ్వర్య రాజ్ గెస్ట్ పాత్రలు చేస్తు్ననారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోను బట్టి చూస్తూ సినిమాను ఔట్ అండ్ ఔట్ కామెడీగా రూపొందించినట్లు అర్థమవుతోంది.
ఓ వేడుకకు ఈ మూడు జంటలు హజరు కాగా అక్కడ కథానాయికలు తమ భర్తల గురించి చెబుతూ తామంటే వారు పడి చస్తారని, క్షణం విడిచి పెట్టి ఉండలేరని, చెప్పిన మాటను జవ దాటరు అంటూ గొప్పలు చెబుతుంటారు. మరోవైపు తమ భార్యల మాటలకు తల ఊపుతూ బయటకు నవ్వుతూ లోలోపల టార్చర్ అనుభవిస్తున్నట్లు ఇచ్చే లుక్స్ అదిరిపోయాయి. సరిగ్గా అదే సమయంలో సందర్భోచితంగా భర్తలు పడే పాట్ల గురించి మనో పాడిన పాట చూసే వారికి నవ్వులు తెప్పించేలా ఉంది. ఇక చివరకు అప్పటివరకు భార్య చాటు భర్తలుగా ఉన్న ముగ్గురు తమ భార్యల టార్చర్‌ను తప్పించుకునేందుకు ఎలాంటి ఫ్లాన్ చేశారనే పాయింట్‌తో ముగించారు.
ఇదిలాఉంటే ఈ ప్రోమో చూసిన వారికి ముఖ్యంగా భర్తలకు కనెక్ట్ అయ్యేలా ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ఎదుటకు రానుంది. మరోవైపు ఇటీవలే తన భార్య తరుపున సమస్యలు ఉన్నాయి విడాకులు కావాలంటూ కోర్టు మెట్లెక్కిన రవి తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను సినిమాగా ఏమైనా తీస్తున్నాడా అని చాలామంది నెటిజన్లు సెటైర్లు వేస్తుండండం విశేషం.