Parasakthi: రత్నమాల.. ఏం సాంగ్ రా బాబు.. పోవడం లేదు మైండ్ లో నుంచి

ABN , Publish Date - Nov 25 , 2025 | 08:12 PM

వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో అరడజను సినిమాలు పోటీకి దిగుతున్నాయి. అందులో ఒకటి పరాశక్తి (Parasakthi). శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నాడు

Parasakthi

Parasakthi: వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో అరడజను సినిమాలు పోటీకి దిగుతున్నాయి. అందులో ఒకటి పరాశక్తి (Parasakthi). శివకార్తికేయన్ (Sivakarthikeyan) హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి మోహన్, అధర్వ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ వరుసగా లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేశారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సింగారాల సీతాకోక చిలుక అనే సాంగ్ తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఇక తాజాగా రత్నమాల అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. జీవీ ప్రకాష్ కుమార్.. తన మ్యూజిక్ టాలెంట్ ను మరోసారి ప్రేక్షకులకు రుచి చూపించాడు. అసలు ఈ మధ్యకాలంలో మెలోడీ సాంగ్స్ రావడం లేదు. ఈ సాంగ్ ఎంతో వినసొంపుగా అదిరిపోయింది.

మెలోడీ సాంగ్స్ లో రత్నమాల ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది అని చెప్పొచ్చు. రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ ఒక ఎత్తు అయితే.. ఆ లిరిక్స్ ను తన గాత్రంతో మరింత వినసొంపుగా మార్చదు జీవి ప్రకాష్. తెలుగు రాకపోయినా కూడా ప్రతి పదాన్ని ఎంతో అద్భుతంగా పలికాడు. అలకతో కోపంగా ఉన్న ప్రియురాలి మనసును కరిగించడానికి ప్రియుడు ఈ సాంగ్ ను పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీలీల అందాన్ని, ఆమెతో గడిపిన క్షణాలను శివకార్తికేయన్ చెప్పుకొచ్చాడు. ఇక వారిద్దరి హుక్ స్టెప్ నెక్స్ట్ లెవెల్.. రేపటి నుంచి ఈ హుక్ స్టెప్ రీల్స్ లో మారుమ్రోగిపోయేలా ఉందని చెప్పొచ్చు. ఈ మెలోడీ సాంగ్ విన్న నెటిజన్స్ ఏం సాంగ్ రా బాబు అస్సలు పోవడం లేదు మైండ్ లో నుంచి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో శివకార్తికేయన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Nov 25 , 2025 | 08:46 PM